కన్న తల్లి ముందే ప్రముఖ నటుడిపై దాడి చేసిన దుండగులు.. నెట్టింట వీడియో వైరల్!

May 14, 2024

కన్న తల్లి ముందే ప్రముఖ నటుడిపై దాడి చేసిన దుండగులు.. నెట్టింట వీడియో వైరల్!

ఇటీవల కాలంలో సామాన్యులకు మాత్రమే కాకుండా సెలబ్రిటీలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. సెలబ్రిటీలపై కూడా దాడులు జరుగుతున్నాయి. తాజాగా కూడా ప్రముఖ కన్నడ నటుడిపై కొందరు దుండగులు విచక్షణ రహితంగా రక్తం వచ్చేలా దాడి చేశారు. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు సదరు నటుడు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? అసలేం జరిగింది? ఎందుకు అతనిపై దాడి చేశారు అన్న వివరాల్లోకి వెళితే.. కన్నడ నటుడిగా చేతన్ చంద్ర రాణిస్తున్నారు. కన్నడలో పలు సీరియల్స్, సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చంద్ర.

అయితే తాజాగా ఆదివారం రోజు మదర్స్ డే కావడంతో చేతన్ తన తల్లిని తీసుకుని గుడికి వెళ్ళాడు. బెంగుళూరు లోని కల్గిపురలో ఒక గుడిని సందర్శించి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. మద్యం సేవించిన ఒక వ్యక్తి చేతన్ కారుని ఫాలో అయ్యాడు. అలా ఫాలో అవుతూ కాసేపటికి కారుని డ్యామేజ్ చేశాడు. దాంతో చేతన్ ఇదేంటి అని ప్రశ్నించగా వెంటనే చేతన్ పై దాడికి దిగాడు సదరు దుండగుడు. వెంటనే అతడి గ్యాంగ్ మరో 20 మంది అక్కడికి చేరుకొని చేతన్ ని తీవ్రంగా గాయపరిచారు. ముక్కుకి గాయం అయింది. చేతన్ రక్తం వచ్చేలా గాయపడ్డాడు.

చేతన్ పై దాడికి దిగిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో చేతన్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాదు. సోషల్ మీడియాలో సైతం తనకి న్యాయం కావాలి అంటూ పోస్ట్ చేశాడు. తనకి న్యాయం కావాలని కోరాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు. దాడి జరిగిన తర్వాత ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించి తనకు న్యాయం జరిగేలా చేయమని కోరాడు చేతన్ చంద్ర.

Read More: అజయ్ దేవగణ్ సినిమా ఫ్లాప్.. RRR, జవాన్ లపై అలాంటి వాఖ్యలు చేసిన బోని కపూర్?

Related News

ట్రెండింగ్ వార్తలు