ఆస‌క్తి పెంచుతోన్న శ్రీ‌విష్ణు `భళా తందనాన` ఫస్ట్ లుక్

December 22, 2021

ఆస‌క్తి పెంచుతోన్న శ్రీ‌విష్ణు `భళా తందనాన` ఫస్ట్ లుక్

విలక్షణ కథలతో తన మార్క్ చూపెడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ఈ సంవ‌త్స‌రం రాజ రాజ చోర సినిమాతో ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. ప్ర‌స్తుతం బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వంలో ‘భళా తందనాన’ అనే కమర్షియల్ఎంటర్‌టైనర్ మూవీలో న‌టిస్తున్నారు. కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్. రీసెంట్‌గా మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ఇక‌ ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు ‘భళా తందనాన` ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇన్ సైడ్ వైట్ టీ షర్ట్ ధరించి డెనిమ్ షర్ట్, బ్లూ జీన్స్‌తో ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న శ్రీ విష్ణు లుక్ సినిమాపై ఆసక్తి పెంచేస్తోంది. చేతిలో రెండుతుపాకులుపట్టుకొని ఎంతోకోపంగా కనిపిస్తున్న శ్రీవిష్ణుచుట్టూ రౌడీ గ్యాంగ్ కనిపిస్తుండటంఈ కథఎంతస్ట్రాంగ్‌గా ఉండనుందో చెబుతోంది. భళాతందనాన చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ లకు కొదవే ఉండదని తెలుస్తోంది.

వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయికొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలు కడుతుండగా.. సురేష్ రగుతు కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు