November 30, 2024
ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన `టాక్ షో` సంప్రదాయాన్ని ‘ది రానా దగ్గుబాటి షో’(The Rana Daggubati Show) బ్రేక్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ షోలో రానా హోస్ట్ అనే కంటే వచ్చిన గెస్ట్‌లతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ క్యాజువల్‌గా షో నడపడం చాలా బాగుంది. ఈ షో మొదటి ఎపిసోడ్‌లో హీరో నాని, ‘హను– మాన్’(Hanu-Man) ఫేమ్ తేజ సజ్జా, నటి ప్రియాంకా మోహన్ అతిథులుగా వచ్చి అలరించారు. ఈ వీక్షకులనుంది మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది.
తాజాగా ‘ది రానా దగ్గుబాటి షో` రెండవ ఎపిసోడ్‌కు డీజె టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, ట్రెండిండ్ యాక్ట్రెస్ శ్రీలీల గెస్ట్‌లుగా వచ్చారు. సరదా సంభాషణలు, లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్ తో ఈ ఏపిసోడ్ కూడా సరదాగా సాగింది. ముఖ్యంగా ఈ షోలో సిద్ధూ, రానా.. శ్రీలీలని తన బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రస్థావించారు. అధికారిక ప్రకటన ఇంకా ఉండటంతో, శ్రీలీల చాలా విషయాలు వెల్లడించకుండా ఉండటానికి ప్రయత్నించింది. కానీ రానా ఒత్తిడితో చివరికి `అవును అది నిజం, నేను బాలీవుడ్‌లో పనిచేయడం ఇదే తొలిసారి. అదో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్` అని చెప్పుకొచ్చింది.
శ్రీలీల ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ నంబర్ కిస్సిక్‌లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో అలరించింది. ఇక శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి హోస్ట్‌గా రూపొందించిన అన్ స్క్రిప్ట్ తెలుగు ఒరిజినల్ ఎనిమిది ఎపిసోడ్‌ల సిరీస్‌లో దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య అక్కినేని, ఎస్.ఎస్. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి అద్భుతమైన అతిథులు రాబోతున్నారు. ప్రతి శనివారం కొత్త ఎపిసోడ్‌లు రానుంది. రానా దగ్గుబాటి షో రెండవ ఎపిసోడ్ శనివారం, నవంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలలో ప్రసారం కానుంది.