వామ్మో శ్రీ లీల ఏంటి ఇలా మారిపోయింది… గుర్తుపట్టలేనంతగా?

June 12, 2024

వామ్మో శ్రీ లీల ఏంటి ఇలా మారిపోయింది… గుర్తుపట్టలేనంతగా?

పెళ్లి సందడి సినిమా ద్వారా ఎంతో ముద్దుగా నాజూగ్గా ఉంటూ ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి శ్రీ లీల. ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె అనంతరం రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో క్రేజ్ పెరిగిపోయింది. వరుసగా యంగ్ హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోల వరకు సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఈమె నటించిన సినిమాలలో ఏవి కూడా పెద్దగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు కేవలం బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా మాత్రమే మంచి సక్సెస్ అందుకుంది. అందులో ఈమె బాలయ్యకు కూతురు పాత్రలో నటించారు.

ప్రస్తుతం తెలుగులో శ్రీ లీల పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగల్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తి అవుతుందో తెలియదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మంత్రిగా కూడా బాధ్యతలు అందుకున్నారు కనుక సినిమా షూటింగులు ఆలస్యం కావచ్చు. ఇక ఇటీవల ఈమె రవితేజతో తిరిగి మరో సినిమా అవకాశాన్ని అందుకున్నారు.

రవితేజ 75వ సినిమాగా ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది తాజగా ఈ పూజ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలలో శ్రీ లీల ఆరెంజ్ సారీ కట్టుకొని కనిపించారు అయితే ఈమె గుర్తుపట్టలేనంతగా చాలా బొద్దుగా మారిపోవడంతో ఒకసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. అరేయ్ ఇక్కడ ఉన్నది శ్రీలీలేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈమె శరీర బరువు పెరిగిపోవడంతో బొద్దుగా మారిపోయారు దీంతో శ్రీ లీల ఏంటి ఇంత లావు అయ్యారు గుర్తుపట్టలేకపోతున్నాము కదా అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

Read More: కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ మంత్రిగా ప్రమాణం చేసిన పవన్.. సంతోషంలో ఫ్యాన్స్!

ట్రెండింగ్ వార్తలు