మామయ్య పక్కన మద్యం.. వాటర్ బాటిల్స్ ఉండాల్సిందే.. బాలయ్య అల్లుడి కామెంట్స్ వైరల్!

June 3, 2024

మామయ్య పక్కన మద్యం.. వాటర్ బాటిల్స్ ఉండాల్సిందే.. బాలయ్య అల్లుడి కామెంట్స్ వైరల్!

నందమూరి నట సింహం బాలకృష్ణ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన హీరో విశ్వక్ నటించిన గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య చైర్ పక్కనే వాటర్ బాటిల్ తో పాటు మద్యం కలిపిన బాటిల్ కూడా కనిపించింది. అయితే ఇది నిజం కాదు అని ఎవరో ఈ వీడియోలను క్రియేట్ చేశారని నిర్మాత నాగ వంశీ కొట్టి పారేశారు.

ఇలా బాలయ్య ఈ కార్యక్రమంలో మద్యం తాగారనే వార్తలు రావడమే కాకుండా వేదికపై హీరోయిన్ అంజలిని తోయడంతో పెద్ద ఎత్తున వివాదంగా మారింది. అయితే ఈ వివాదంలో భాగంగా బాలయ్య పై చాలా మంది విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో బాలకృష్ణ గురించి,ఆయన మందు అలవాట్ల గురించి తన చిన్నల్లుడు శ్రీ భరత్ చేసిన కామెంట్స్ తెరపైకి వచ్చాయి.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి భరత్ బాలకృష్ణ అలవాట్ల గురించి మాట్లాడుతూ..మామయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతాడని తెలిశాక ఆ కంపెనీ స్టాక్స్ విలువ పెరిగింది అన్నారు. ఆయన హాట్ వాటర్ లో కలుపుకుని తాగుతాడట కదా? అని యాంకర్ భరత్ ని అడగ్గా… అవును అది నిజం అని ఒప్పుకున్నాడు భరత్.

మావయ్య దగ్గర ఒక బ్యాగ్ ఉంటుందని అందులో మద్యం బాటిల్ తో పాటు హాట్ వాటర్ బాటిల్ ఉంటుందని ఎక్కడికి వెళ్లినా ఆయన ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్తారని భరత్ తెలిపారు. అమెరికా వెళ్లిన కూడా ఆ బ్యాగు తన వెంటే ఉండాల్సిందే అంటూ భరత్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. భరత్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో పలువురు విమర్శలు చేశారు.

మందు తాగడం ఏదైనా గొప్ప విషయమా ఇలా చెప్పడానికి అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం బాలకృష్ణను స్ఫూర్తిగా తీసుకొని ఆయన అభిమానులు కూడా మందుకు బానిసలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కామెంట్ చేశారు. మరి ఈ కార్యక్రమంలో బాలకృష్ణ నిజంగానే మందు తాగారా లేదా అన్నది తెలియదు కానీ భరత్ చేసిన ఈ కామెంట్స్ మాత్రం ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు