మహేష్.. రాజమౌళి సినిమాపై క్లారిటీ అప్పుడే.. వెయిట్ చేయాల్సిందే?

February 21, 2024

మహేష్.. రాజమౌళి సినిమాపై క్లారిటీ అప్పుడే.. వెయిట్ చేయాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకదీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో గొప్ప డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా తన సినిమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా గెలిచిన ఘనత రాజమౌళికి ఉందని చెప్పాలి.

ఇలా రాజమౌళి సినిమా అంటేనే ఇంటర్నేషనల్ లెవెల్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి ఇక ఈయన త్వరలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారనే విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇలా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉండగా ఈ సినిమా గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇలా ప్రతిరోజు ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తల గురించి చిత్ర బృందం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో కేఎల్ నారాయణ భారీ ఖర్చుతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అన్నిటికీ చెక్ పెడుతూ పూర్తి వివరాలను త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తామని అప్పటివరకు అభిమానులు కాస్త ఓపికతో ఎదురు చూడాల్సిందే అంటూ మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమా ఏ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోయిన్ ఎవరు అలాగే ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో కూడా నటించబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు అన్నిటికి క్లారిటీ రావాలి అంటే మరి కొద్ది రోజులు వేచి ఉండాలని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథ అందించగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read More: హైదరాబాదులో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్.. విడుదల అప్పుడే?

ట్రెండింగ్ వార్తలు