దేవుడా.. మహేష్ రాజమౌళి సినిమా వచ్చేది అప్పుడేనా.. షాక్ లో మహేష్ ఫ్యాన్స్?

June 7, 2024

దేవుడా.. మహేష్ రాజమౌళి సినిమా వచ్చేది అప్పుడేనా.. షాక్ లో మహేష్ ఫ్యాన్స్?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా డైరెక్టర్గా గుర్తింపు పొందారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రాంచరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్నదో మనకు తెలిసిందే.

ఈ సినిమా ద్వారా రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుంది. అంతేకాకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఓ అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అయితే వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. ఇక రాజమౌళితో సినిమా అంటే ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇష్టపడతారు కానీ ఆ సినిమా కోసం ఎదురుచూసి అభిమానులు కళ్ళు కాయలు కాస్తూ ఉంటాయి. ఆయన ఒక్కో సినిమాకు దాదాపు మూడు నాలుగు సంవత్సరాల సమయం తీసుకుంటారు.

ఇలా ఒక్కో సినిమాకు ఎన్ని రోజుల సమయం కేటాయించాలి అంటే సెలబ్రిటీల అభిమానులు తెగ ఫీల్ అవుతూ ఉంటారు అయితే మహేష్ బాబుతో చేయబోయే సినిమా కూడా అదే సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ సినిమా ఏకంగా 2027వ సంవత్సరంలో విడుదల కాబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా మహేష్ బాబు అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల తేదీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

Read More: ఆర్పీ చేపల పులుసు రెస్టారెంట్ పై దాడి చేసిన బన్నీ ఫ్యాన్స్.. అదే కారణమా?

ట్రెండింగ్ వార్తలు