డైరెక్టర్స్‌గా మారిన ఫైట్‌ మాస్టర్స్‌

January 6, 2022

డైరెక్టర్స్‌గా మారిన ఫైట్‌ మాస్టర్స్‌
stunt duo turn directors for Raghava Lawrence’s ‘Durga’: కేజీఎఫ్‌ సినిమాలో హీరోగా చేసిన యశ్‌కు యాక్టర్‌గా ఎంత పేరు వచ్చిందో ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్‌ నీల్, ఫైట్‌ మాస్టర్స్‌ అన్బు, అరివిలకు అంతే పేరు వచ్చింది. ఇప్పుడీ ఫైట్‌ మాస్టర్స్‌ ప్రస్తావన ఎందుకంటే.. ఈ ఇద్దరు డైరెక్టర్స్‌గా మారారు. వీరికి ఈ బాధ్యతను అప్పజెప్పిన హీరో రాఘవాలారెన్స్‌. గత ఏడాది లారెన్స్‌ హీరోగా ‘దుర్గ’ అనే సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈ సినిమాకు రాఘవ లారెన్సే దర్శకత్వం వహిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిత్రంతో ఫైట్‌ మాస్టర్స్‌ అన్బు, అరివిలను దర్శకులుగా పరిచయం చేస్తున్నారు రాఘవా లారెన్స్‌. అన్బు, అరివి ఇద్దరూ ఇటు ఫైట్‌మాస్టర్స్‌గాను తెలుగులో పెద్ద సినిమాలు చేస్తున్నారు.

Read More : అయోమ‌యంలో గ‌ని! 

ట్రెండింగ్ వార్తలు