HaromHara Twitter Review: సుధీర్ బాబు సాలీడ్ హిట్ అందుకున్నారా?

June 14, 2024

HaromHara Twitter Review: సుధీర్ బాబు సాలీడ్ హిట్ అందుకున్నారా?

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు..మొద‌టి సినిమా ఎస్ఎంఎస్‌తోనే మంచి హిట్ అందుకున్నారు. ఆ త‌ర్వాత ప్రేమ‌క‌థాచిత్రంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది కానీ మొద‌టి రెండు చిత్రాలు ఇచ్చిన విజ‌యంతో స్క్రిప్ట్ సెల‌క్ష‌న్ విష‌యంలో అంచ‌నాలు త‌ప్పాడు..ఫ‌లితంగా వ‌రుస పరాజ‌యాల్ని చ‌వి చూడాల్సి వ‌చ్చింది. దాంతో ప్ర‌స్తుతం ఈ హీరో త‌న మార్కెట్ కోల్పోకుండా ఉండాలంటే త‌ప్ప‌కుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్ప‌డింది.

సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ ద్వారక తెర‌కెక్కించిన తాజా చిత్రం హ‌రోంహ‌ర. బిగ్గెస్ట్ యాక్ష‌న్ మూవీగా రూపొందిన ఈ సినిమాపై గంపెడు ఆశ‌లు పెట్టుకున్నాడు సుధీర్ బాబు. మాళ‌విక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో సునీల్‌, జ‌య‌ప్ర‌కాశ్, అక్ష‌ర‌, అర్జున్‌గౌడ‌, ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. చైత‌న్ భ‌రద్వాజ్ సంగీత ద‌ర్శ‌కుడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ తో ఈ సినిమాపై పాజిటివ్ ఇంప్రెష‌న్ క‌ల్పించారు మేక‌ర్స్‌..మ‌రి ఈ రోజు (జూన్ 14)న విడుద‌లైన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ రివ్యూ ఇస్తున్నారు.

గ‌త సినిమాల‌తో పోలిస్తే ఈ సినిమాలో సుధీర్ బాబు అద్భుతంగా న‌టించార‌ని సినిమా చూసిన ప్రేక్ష‌కులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ సారి సుధీర్ బాబు స్క్రిప్ట్ సెల‌క్ష‌న్ కూడా బాగుంద‌ని, యూనిక్ కాన్సెప్ట్‌తో సినిమా తెర‌కెక్కింద‌ని చెబుతున్నారు. ఈ సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్సెస్ హైలెట్ గా నిలుస్తాయి అంటున్నారు. విజువ‌ల్స్‌, చైత‌న్ భ‌రద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను విజ‌యం దిశ‌గా న‌డిపించాయి అని చెబుతున్నారు. మ‌రి ఈ సినిమాతో సుధీర్ బాబు క‌మ్‌బ్యాక్ అయ్యారో లేదో రివ్యూలో చూద్దాం.

Read MoreMaharaja Telugu Review: విజ‌య్ సేతుప‌తి మ‌హారాజ ఎలా ఉందంటే?

ట్రెండింగ్ వార్తలు