December 15, 2021
2017…‘లై’..ప్రీ రిలీజ్ ఫంక్షన్. ‘‘కొందరు దర్శకులు సెట్స్ డైరెక్టర్స్. సెట్స్‌లోనే తమకు కావాల్సిందంతా షూట్ చేసేస్తారు. మరికొందరు తమ దగ్గర ఉన్న ఫుటేజీని ఎడిట్ రూమ్‌లో డైరెక్ట్ చేస్తూ…షాట్స్‌ను ఊరికే మారుస్తుంటారు…నేను ఎడిట్‌రూమ్ డైరెక్టర్‌ని’’ అని సుకుమార్ అన్నారు. ఇప్పుడు సుకుమార్ ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నాడు. ఎడిట్‌రూమ్‌లో తీవ్రకష్టాలు పడుతున్నాడు. ‘పుష్ప: ది రైజ్’ ఫైనల్ కాపీని ఫైనల్ చేసే పనిలో తలమునకలైఉన్నాడు. పైగా ఎడిట్‌రూమ్‌లోనే సుకుమార్ తన సినిమాను చెక్కుతుంటారు. అలాంటిది ‘పుష్ప’ సినిమా రిలీజ్‌మరికొన్ని గంటల్లో ఉండగా సుక్కు ఇంకా చెక్కుతూనే ఉన్నాడు. మరోవైపు ఈ రోజు ఫైనల్ కాపీ సర్వీస్ ప్రొవైడర్స్ యూఎఫ్‌ఓలకు వెళితేనే డిసెంబరు 16 ఓవర్‌సీస్‌లో ప్రీమియర్స్ పడతాయి. లేకపోతే అంతే. ఓవర్‌సీస్‌లో ప్రీమియర్స్ పడకపోతే ‘పుష్ప’ సినిమా నిర్మాతలకు హ్యూజ్ లాస్. పైగా ‘పుష్ప’ నిర్మాణంలో అల్లుఅర్జున్ మావయ్యలు(రవి, కృష్ణ, విజయ్, రాజేంద్ర(ఇటీవల చనిపోయారు)) భాగస్వామ్యులు. సో.. ఓవర్‌సీస్ ప్రిమియర్స్ క్యాన్సిల్ అయితే వ్యక్తిగతంగా అల్లుఅర్జున్‌కు ఇబ్బందే. ఈ విషయం సుకుమార్‌కు తెలుసు. సో..అందుకనే ఎలాగైనే ఓవర్‌సీస్‌లో ప్రిమియర్స్ పడేలా చేస్తాడు. ఇలా రిలీజ్‌కు ఒకరోజు ముందు ఫైనల్ కాపీ సర్వీస్ ప్రొవైడర్స్‌కు వెళ్లింది.
Read More: ఒక వేళ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తే ..ఆ తర్వాత పరిస్థితులను బట్టి స్పందిస్తా…నందమూరి బాలకృష్ణకీలకమైన సీన్స్, కొన్ని సాంగ్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే డిసెంబరు 17న ‘పుష్ప’ సినిమా వస్తుందని టీమ్ ప్రకటించడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. పైగా ఐదు భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని సినిమా ఫస్ట్ కాపీని డెలివర్ చేయాలంటే చిన్న విషయం కాదు. అందులోనూ సుకుమార్ ఎడిట్‌రూమ్ డైరెక్టరైపాయే. దీంతో ‘పుష్ప’ సినిమా టీమ్‌కు కష్టాలు తప్పలేదు. అయినా చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’ నిర్మాతలు డిసెంబరు 17 తేదీని ఇవ్వమని అడిగారు. కానీ ‘పుష్ప’ టీమ్ ఒప్పుకోలేదు. అప్పుడే ఒప్పుకుని ఉంటే ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్ కష్టాలు, టెన్షన్ అల్లు అర్జున్‌కు తప్పేవి. పైగా సినిమాను బాగా ప్రమోట్ చేసుకోగలిగి ఉండేవారు (సుకుమార్ ఇంతవరకు ప్రమోషన్స్‌లో కనిపించలేదు). ఇక..ఎన్టీఆర్ కెరీర్‌లో 25వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో..’ సినిమాకు సేమ్ సీన్ జరిగింది. కానీ ఆ సినిమా హిట్. అలాగే ‘పుష్ప’ చిత్రం కూడా హిట్ కావాలని సుకుమార్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.