ఆ కారణంతోనే నేను మూడో బిడ్డను కనలేదు.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్!

June 21, 2024

ఆ కారణంతోనే నేను మూడో బిడ్డను కనలేదు.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్!

యాంకర్ సుమ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర నటిగా యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు. కెరియర్ మొదట్లో బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసిన సుమ అనంతరం తన మాట తీరుతో యాంకర్ గా ప్రేక్షకులను మెప్పించి ప్రస్తుతం ఇండస్ట్రీలో యాంకర్ గానే స్థిరపడ్డారు. ఒకప్పుడు సుమ వరుస బుల్లితెర కార్యక్రమాలతో బుల్లితెరపై అన్ని చానల్లోనూ సందడి చేసేవారు.

ఇక ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలను తగ్గించిన సినిమా ఈవెంట్లతో బిజీ అయ్యారు.. ఒక సినిమా విడుదలకు సిద్ధమవుతుంటే ఆ సినిమా ట్రైలర్ లాంచ్ నుంచి మొదలుకొని సక్సెస్ మీట్ వరకు సుమ యాంకర్ గా వ్యవహరిస్తూ ఆ సినిమా వేడుకలను విజయవంతం చేస్తుంటారు. ఇక ప్రస్తుతం ఈమె సినిమా ఈవెంట్ తో పాటు ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారమయ్యే సుమ అడ్డా కార్యక్రమానికి మాత్రమే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ శనివారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా ఈ వారం బుల్లితెర నటిమణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇందులో భాగంగా ఓ నటి నేను ఒక సీరియల్ లో నటిస్తూ ఉండేదని ఆ సీరియల్ పూర్తి కావడంతో కాస్త బ్రేక్ రావడం వల్ల ఒక బాబుని కన్నానని తెలిపారు. అలాగే ఇది కూడా ఒక కూతుర్ని కనింది అంటూ అక్కడ ఉన్నటువంటి వారందరి గురించి చెప్పారు.

ఇక సుమా కూడా మాట్లాడుతూ ఇప్పుడు అర్థమైందా నేను కూడా మూడో బిడ్డని ఎందుకు కనలేదు అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంటే తనకు బుల్లితెర కార్యక్రమాలు సినిమా ఈవెంట్లు అంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలోనే మూడో బిడ్డను కనడానికి సమయం లేక ఇద్దరికే చాలు అనుకున్నాము అంటూ ఈ సందర్భంగా సుమ చెప్పకనే చెప్పేశారు. ప్రస్తుతం సుమ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: మాజీ భర్తను తిరిగి పొందడం ఎలా.. సంచలనంగా రేణు దేశాయ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు