June 28, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు మహేష్ బాబు. ఈయన హీరోగా ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇప్పటివరకు మహేష్ బాబు నటించిన సినిమాలన్నీ కూడా కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇక త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంకా ఈ సినిమా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.
ఇక త్వరలోనే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుంది. ఇక ఇటీవల కాలంలో మహేష్ బాబు ప్రయోగాత్మక సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. అయితే ఏదైనా ఒక సినిమా చేయాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారట.. కానీ ఓ సినిమాకు కమిట్ అయ్యేముందు ఈ సినిమా చేస్తే మంచిదేనా అని చాలా సార్లు ఆలోచించి ఆ సినిమా చేశారట అయితే ఆ సినిమా చేసిన తర్వాత పార్ట్ 2 కూడా తీస్తే బాగుంటుందని మహేష్ ఆలోచించారు మరి ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే..
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం `భరత్ అనే నేను` ఈ సినిమా రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. ఏ విధమైనటువంటి పొలిటికల్ టచ్ లేని నేను సీఎం పాత్రలో నటిస్తే ప్రేక్షకులు చూస్తారా అన్న సందేహం ఉండేది.. కానీ ఈ సినిమాలో భయపడుతూనే నటించాను కానీ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని, కొరటాల గారు ఈ సినిమా కథను నాకు బ్యాంకాక్ లో ఐదు గంటల పాటు వివరించారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇక ఈ సినిమాకి ఎంత మంచి ఆదరణ రావడమే కాకుండా సమాజానికి ఎంతో ఉపయోగకరమైన సందేశం ఉంది.. దీంతో ఈ సినిమాకి పార్ట్ 2 కూడా వస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు సూపర్ స్టార్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More: Mahesh Babu: ఇలా నవ్వి చాలా రోజులైంది!