తన సక్సెస్ వెనుక సీక్రెట్ ఇదే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా!

February 26, 2024

తన సక్సెస్ వెనుక సీక్రెట్ ఇదే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన తమన్నా!

తమన్నా తన సినిమా కెరియర్ ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తి కావస్తుంది అయినప్పటికీ ఈమెలో ఉన్న గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. అలాగే వెబ్ సిరీస్, సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతూ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే తమన్నా అసలు పేరు ఇది కాదంట, కొన్ని కారణాల వలన తన పేరుని మార్చుకున్నాను అని ఈ టైంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అసలు విషయం బయట పెట్టింది.

నిజానికి సినిమాలలో ఎంట్రీ ఇద్దాం అనుకునే సమయానికి తమన్నా ని కలిసిన ఒక వ్యక్తి తన పేరులో కొద్దిగా మార్పులు చేసుకోమని చెప్పాడంట. ఇంగ్లీషులో అదనంగా ఏ, హెచ్ జోడించమని సలహా ఇచ్చాడట. ఆ విధంగా తన పేరు Tamannaah అయిందని చెప్పింది ఈ భామ. అయితే పేరు మార్చుకోవటం వలన పాజిటివ్ ఫీలింగ్ కలిగిందని, కెరీర్ పరంగా కూడా చాలా కలిసి వచ్చిందని తమన్నా ఇంటర్వ్యూలో చెప్పటం విశేషం.

నిజానికి తమన్నా అంటే కోరిక అని అర్థం అట. చిన్నతనం నుంచి నటిని కావాలని కలలు కన్న తమన్నా టీనేజ్ లోకి వచ్చేటప్పటికి మోడలింగ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత 2005 లో ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ ఒకేసారి హీరోయిన్ అయిపోయింది. ఆపై తమిళ, కన్నడ సినిమాలో కూడా నటించి బిజిస్టార్ గా మారిపోయింది తమన్నా.

మిగిలిన భాషలలో కన్నా టాలీవుడ్ లో ఆమె ఎక్కువ స్టార్డం సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. అయితే శృంగార సన్నివేశాలలో శృతిమించి నటించడం పట్ల ప్రేక్షకుల విమర్శలను సైతం పక్కన పెట్టేసింది ఈ భామ. ప్రస్తుతం ఈమె నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తుంది. విజయ్ వర్మ కూడా నటుడే. నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా నటించాడు ఈ విజయ్ వర్మ.

Read More: Nagababu: ఆ విషయంలో వరుణ్‌ ఫెయిలయ్యాడు.. కానీ.. : నాగబాబు

ట్రెండింగ్ వార్తలు