తమిళ నటుడు డేనియల్ బాలాజీ ఆకస్మిక మృతి.. షాక్ లో కోలీవుడ్ ఇండస్ట్రీ!

March 30, 2024

తమిళ నటుడు డేనియల్ బాలాజీ ఆకస్మిక మృతి.. షాక్ లో కోలీవుడ్ ఇండస్ట్రీ!

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ ఆకస్మికంగా మరణించారు. శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో తీవ్రస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. దీంతో కోలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరనిలోటు. ఒక పెద్ద విలన్ ని ఇండస్ట్రీ కోల్పోయింది అంటూ తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈయన తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ సినిమాలలో విలన్ గా యాక్ట్ చేశారు.

మొదట సీరియల్స్ లో నటించి తర్వాత వెండి తెరమీద విలన్ గా మారి ఎన్నో విజయాలని సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ మదాతిల్, కాదల్ కొండెన్ సినిమాలలో విలన్ గా చేసి మెప్పించాడు. ఇక తెలుగు విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సాంబ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన డేనియల్ బాలాజీ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ఘర్షణ మూవీ ద్వారా తనదైన గుర్తింపుని సంపాదించుకున్నాడు.

తర్వాత రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత, నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో వంటి సినిమాలలో నటించాడు. అతను చివరిగా నటించిన తెలుగు సినిమా నాని హీరోగా నటించిన టక్ జగదీష్. ఆయనకి దైవభక్తి కూడా ఎక్కువగానే ఉండేది. చెన్నై సమీపంలోని ఆవడి ప్రాంతంలో రక్తం అంగల పరమేశ్వరి అమ్మన్ ఆలయాన్ని ఆయనే నిర్మించారు. గత ఏడాది సెప్టెంబర్ లో కుంభాభిషేకం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ ఆలయాన్ని ఆయన తన తల్లి కోరిక మేరకు నిర్మించారు. శనివారం పురసైవల్కంలోని ఆయన నివాసంలోనే భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే 48 ఏళ్ల వయసులోనే బాలాజీ మరణించడంతో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. మరొకసారి అందరూ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కూడా ఇలాగే ఆకస్మికంగా మరణించడం గమనార్హం.

Read More: టిల్లు త్రీ కూడా ఉంటుందంట.. నిర్మాత నాగ వంశీ అఫీషియల్ అనౌన్స్మెంట్!

Related News

ట్రెండింగ్ వార్తలు