ప్లీజ్‌ ఒక్కచాన్స్‌ అంటున్న తమిళ డైరెక్టర్‌

July 3, 2022

ప్లీజ్‌ ఒక్కచాన్స్‌ అంటున్న తమిళ డైరెక్టర్‌

తమిళంలో సామీ, ఆరు, సింగమ్‌ సిరీస్‌లను తీసిన దర్శకుడు హరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్‌ చిత్రాలతో మంచి మాస్‌ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లో పేరుబాగానే సంపాదించాడు. కానీ ఇప్పుడు ఈ డైరెక్టర్‌ తెలుగులో ఓ సినిమా చేయాలని ప్లీజ్‌..ఒక్క చాన్స్‌ అంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఎన్టీఆర్‌కు కథ చెప్పాడు. ఎన్టీఆర్‌కి కూడా కథ నచ్చింది. కానీ తన లైనప్‌ను గురించి హరికి ఎన్టీఆర్‌ చెప్పారు. మరో నాలుగు సంవత్సరాలు కాల్షీట్స్‌ ఖాళీ లేవన్నారు. దీంతో ఈ కథను గోపీచంద్‌కు చెప్పారు హరి. గోపీచంద్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే టాక్‌ వినిపిస్తోంది.ఫ్లీజ్‌ ఒక్క చాన్స్‌ అంటున్న తమిళ డైరెక్టర్‌ మరి..‘పక్కా కమర్షియల్‌’ రిజల్ట్‌ను దృష్టిలో పెట్టుకుని గోపీచంద్‌ ఈహరికి చాన్స్‌ ఇస్తారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ

Related News

ట్రెండింగ్ వార్తలు