కొత్త బిజినెస్ ప్రారంభించిన బిగ్ బాస్ టేస్టీ తేజ.. సక్సెస్ అయ్యేనా?

April 6, 2024

కొత్త బిజినెస్ ప్రారంభించిన బిగ్ బాస్ టేస్టీ తేజ.. సక్సెస్ అయ్యేనా?

బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ఎంతోమందికి మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ అయ్యారు. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో టేస్టీ తేజ ఒకరు. ఈయన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వంటకు సంబంధించినటువంటి వీడియోలను షేర్ చేయడమే కాకుండా పలు రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ ఫుడ్ టెస్ట్ చేస్తూ వీడియోలను షేర్ చేస్తూ ఉండేవారు.

ఇలా యూట్యూబర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈయనకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న తేజ హౌస్ లో ఉన్నన్ని రోజులు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చారు. ఇక ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలను కలుస్తూ వీడియోలు చేయడమే కాకుండా కొంతమంది సెలబ్రిటీలు ఈయనతో కలిసి ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

ఇలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి టేస్టీ తేజ సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు.ఈయన హైదరాబాద్లో ఇరానీ నవాబ్స్ పేరుతో బిజినెస్ ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు ఇలా తాను రెస్టారెంట్ పెడుతున్నాననే విషయాన్ని తెలియజేయడమే కాకుండా ఈ ప్రయాణంలో నాతో పాటు మీరు మనందరం కలిసి ఎదుగుదామని పేర్కొన్నారు. సాధిద్దాం సంపాదిద్దాం అంటూ ఈయన షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇక ఈ రెస్టారెంట్ నేడు ఏప్రిల్ ఆరవ తేదీ ప్రారంభం కాబోతుందని వెల్లడించారు. అంతేకాకుండా ఈ రెస్టారెంట్ మరొక బిగ్ బాస్ కంటెస్టెంట్ సీజన్ సెవెన్ రన్నర్ అమర్ దీప్ చౌదరి చేత ప్రారంభం కాబోతుందని కూడా వెల్లడించారు. ఈ విధంగా టేస్టీ తేజ రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలిసి ఈయన మంచి సక్సెస్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read More: ఇలాంటి బూతు షో అవసరమా నిహారిక.. నిహారిక పై మండిపడుతున్న మెగా ఫాన్స్?

Related News

ట్రెండింగ్ వార్తలు