Vishwambara: చిరంజీవితో పోటీకి సై అంటున్న బాలీవుడ్ నటుడు?

June 14, 2024

Vishwambara: చిరంజీవితో పోటీకి సై అంటున్న బాలీవుడ్ నటుడు?

Vishwambara Movie Update: బింబిసార సినిమా ద్వారా దర్శకుడిగా ప‌రిచ‌య‌మై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ వశిష్ట. దాంతో పాటే త‌న‌ రెండో సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేసే ఛాన్స్ అందుకున్నారు. ఇలా వశిష్ట డైరెక్షన్లో చిరంజీవి నటిస్తున్నటువంటి చిత్రం విశ్వంభర ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 10న విడుదల కానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పనులను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటి త్రిష నటించబోతున్నారని తెలిసిందే. స్టాలిన్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తిరిగి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ప్రతిరోజు ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో మరో మెగా హీరో నటించబోతున్నారంటూ కూడా ఇదివరకు వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమా గురించి తాజాగా మేకర్స్ మరొక అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్లోకి విలన్ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పోటీపడి నటించడం కోసం బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విశ్వంభర సెట్ లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. ఈయనకు స్వాగతం పలుకుతూ మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్న నేపథ్యంలోనే బాలీవుడ్ నటులను విలన్ పాత్రలలో తీసుకున్నారని తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు