ఒకే ఒక జీవితం లైఫ్ లాంగ్ నా సినిమా అని చెప్పుకునేలా ఉంటుంది – హీరో శర్వానంద్

December 29, 2021

ఒకే ఒక జీవితం లైఫ్ లాంగ్ నా సినిమా అని చెప్పుకునేలా ఉంటుంది – హీరో శర్వానంద్

యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లె మైల్ స్టోన్ లాంటి చిత్రాన్ని చేయబోతోన్నారు. కెరీర్‌పరంగా 30వ సినిమాగా ఒకే ఒక జీవితం అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైఫై సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలను అందించారు. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించారు. బుధవారం నాడు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..

సతీష్ మాట్టాడుతూ.. ‘ఈ సినిమాలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా యూనిట్ అందరికి చాలా థాంక్స్. అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు..

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘కొన్ని ప్రాజెక్ట్‌లు కేరీర్ కోసం చేస్తాం. కానీ పెళ్లి చూపులు చేసినప్పుడు మా నాన్న కోసం తీశాను. చాలా శ్రద్దగా, నిజాయితీగా చేశాను. మళ్లీ ఇలా అనిపించింది శ్రీ కార్తీక్ సినిమాలోనే. ఇది వాళ్ల అమ్మ కోసం తీశాడు. ఈ సినిమా మనందరికి టచ్ అవుతుంది. ఆయన రాసిని ప్రతి ఒక్క లైన్‌లో డెడికేషన్, మోటివేషన్ ఉంది. అతని తల్లిపై చూపించిన ప్రేమ.. ఈ సినిమాలో స్టార్. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అందరికి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

ఎడిటర్ శ్రీ జిత్ మాట్లాడుతూ.. ‘అవుట్‌ పుట్ చాలా బాగొచ్చింది. ప్రొడ్యూసర్స్‌కు చాలా థాంక్స్. శ్రీ కార్తీక్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.

డివోపీ సుజిత్ మాట్లాడుతూ.. ఇది శ్రీ కార్తీక్ కల. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అమల గారు, శర్వనంద్ గారితో కలిసి పని చేయడం అదృష్టం’ అని అన్నారు..

జేక్స్ బిజోయ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా మాకు చాలా ప్రత్యేకమైనది. శ్రీ కార్తీక్ నా జర్నీ 9 ఏళ్ల ప్రారంభమైంది. అమ్మ పాట చాలా ప్రత్యేకమైంది. ఈ పాటను కంపోజ్ చేసినప్పుడు.. శ్రీ కార్తీక్ అమ్మ గారు నాకు చెప్పినట్టుగా అనిపించింది. అమల గారికి ,శర్వానంద్ గారికి చాలా థాంక్స్. అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నారు’ అని అన్నారు..

ఎస్‌ఆర్ ప్రభు మాట్లాడుతూ.. ‘అంతా ఫ్యామిలీగా కలిసి పనిచేశాం. స్ట్రిప్ట్ చెప్పినప్పుడే.. ఇది అందరికి నచ్చుతుందని అనుకున్నాం. సినిమా విడుదల చేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు..

అమల అక్కినేని మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో అందరికి అమ్మను అయిపోయాను. ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. స్టోరి చెప్పినప్పుడు.. నేను ఈ పాత్రను చేయాలని అనుకున్నాను. మిగిలిన సినిమాలు చేసిన చేయకపోయినా.. ఈ పాత్ర చాలు అనిపించింది. శ్రీ కార్తీక్ ఎంత కష్టపడ్డాడో అంత మంచి పేరు వస్తుంది. సినిమా కోసం పనిచేసిన అందరికి థాంక్స్. తప్పకుండా ఈ సినిమా మీరు ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.

శర్వానంద్  మాట్లాడుతూ.. ‘ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉన్నది ఒకే ఒక జీవితం అందరూ ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి.. ఇప్పుడే మొత్తం మాట్లాడలేను. ఇది నా సినిమానో, శ్రీ కార్తీక్ సినిమానో కాదు.. ఇది వాళ్ల అమ్మ సినిమా. సినిమా నరేషన్ అప్పటి నుంచి ఆమె మా వెనకాల నుంచి నడిపిస్తోంది. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం నాకు ఇచ్చినందుకు ప్రభుకు థాంక్స్. ఇది లైఫ్ లాంగ్ నా సినిమా అని చెప్పుకునే సినిమా. జేక్స్ బిజోయ్ అన్ని సాంగ్స్ ఇరగొట్టాడు. ముఖ్యంగా అమ్మ పాట గురించి చెప్పాలి. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి.. 9 నెలల పాటు రాశారు. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు మన మధ్యలేరు. కానీ పాటల్లో ఎప్పుడూ జీవించే ఉంటారు. ఈ స్టోరి చెప్పగానే అమల గారు చేస్తున్నారా అని అడిగాను. నేను ఈ పాత్రలో ఆమెను మాత్రమే ఊహించుకున్నాను. ఈ సినిమాకు ఆత్మ అమల గారి పాత్ర. ఈ పాటను రిలీజ్‌ చేయడం లేదు. ఒక చిన్న ఈవెంట్ చేసి.. కుదిరితే శాస్త్రి గారి అమ్మగారిని, అమల గారి అమ్మగారిని, మా అమ్మగారిని పిలిచి ఈ వేడుకలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం’ అని అన్నారు.

దర్శకుడు శ్రీ కార్తీక్ మాట్లాడుతూ.. ‘ముందు ఒక కథను రాశాను. కానీ అందులో ఎమోషన్ కనిపించలేదు. తరువాత మా అమ్మ చనిపోయారు. అప్పుడు మళ్లీ కథ రాసేందుకు కూర్చున్నాను. అమ్మను మళ్లీ చూడాలని అనిపించింది. అమ్మని చూడాలని రాసిన ఒక్క సీన్.. అలా పెరిగి ఒకే ఒక జీవితం సినిమాగా మారింది. నిర్మాత ఎస్ ఆర్ ప్రభు సర్ దొరకడం అమ్మ ఇచ్చిన ఆశీర్వాదం. నా అమ్మను మళ్లీ చూడాలనేది నా కోరిక. నాకు ఓ హీరో కూడా కావాలి. ఇందులో స్ట్రాంగ్ ఎమోషనల్ ఉందని తెలుగులోనే ఈ సినిమా చేయాలని అన్నారు. మా అమ్మకు తెలుగు సినిమాలు, పాటలు అంటేనే ఇష్టం. అందుకే మా అమ్మ నాకు శర్వానంద్‌న చూపించారు. శర్వా నటించినప్పుడు నన్ను నేను చూసుకున్నాను. శర్వా మిమ్మల్ని కచ్చితంగా ఏడిపిస్తాడు. 90వ దశకంలోకి మీ అందరినీ తీసుకెళ్తాడు. ఈ పాత్ర రాసినప్పుడే అమల గారు చేయాలని అనుకున్నాను. కానీ ఆమె తిరిగి నటిస్తారా? లేదా? అని నేను ఆలోచించలేదు. ఆమెకు కథ వినిపించాను. ఆడియెన్‌లా విన్నారు. సెట్‌లో నేను మా అమ్మను చూశాను. నేను ఆమెను అమ్మా అని పిలుస్తాను. ఎమోషన్స్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రీతూ, నాజర్ సర్ ఇలా ప్రతీ ఒక్కరూ అద్భుతంగా చేశారు. నా టీం అంతా కూడా కలిసి ఆరేళ్లు ప్రయాణం చేశాం. ఇది ఫీల్ గుడ్ సినిమాల మిగిలిపోతుంది. చెన్నై తెలుగులో డైలాగ్స్ రాస్తే మీరు తిడతారు అని.. తరుణ్ భాస్కర్‌ను అనుకున్నాను. పెళ్లి చూపులు సినిమా చూసి ఆశ్చర్యపోయాను. తరుణ్ భాస్కర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయనలో నన్ను చూసుకున్నాను’ అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు