తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు రద్దు.. జూలై 1 వరకు గడువు!

May 23, 2024

తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు రద్దు.. జూలై 1 వరకు గడువు!

సరైన సినిమాలు విడుదల లేకపోవడం, ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుండడం, వరుసగా నష్టాల పాలవుతూ ఉండటంతో తెలంగాణలో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్ కొన్ని రోజులు మూసేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ధియేటర్ లకి ప్రేక్షకులు రావట్లేదని ఎక్కువగా నష్టాలు వస్తున్నాయని చెబుతూ 10 రోజుల వరకు థియేటర్స్ మూసేస్తామని ప్రకటించారు. మే 25న ఈ థియేటర్స్ ఓపెన్ అవుతాయని సమాచారం. ఇప్పుడు తాజాగా బెనిఫిట్ షో లు ప్రదర్శించబోమని ప్రకటించారు తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజయేంద్ర రెడ్డి.

ఇతర రాష్ట్రాల,దేశాల తరహాలోనే టాలీవుడ్ లో కూడా ఎగ్జిబిటర్లకు నిర్మాతలు పర్సంటేజీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్ల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్టీప్లెక్స్ తరహాలోనే నిర్మాతలు పర్సంటేజీలను చెల్లిస్తే సినిమాలను ప్రదర్శిస్తామని లేదంటే థియేటర్ల మూత తప్పదని హెచ్చరించారు. గత పది సంవత్సరాలలో 2000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేశారు.

కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు. బెనిఫిట్ షో లు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక మీదట బెనిఫిట్ షోలు అదనపు ఆటలు ప్రదర్శించము అన్ని సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ఆడిస్తాము అని చెప్పారు. కల్కి, పుష్ప టు, గేమ్ చేంజ్, భారతీయుడు లాంటి సినిమాలు మాత్రం బెనిఫిట్ షోలో ప్రదర్శిస్తామని తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు.

నిర్మాతలకి జూలై 1వ తేదీ వరకు గడువు ఇస్తున్నాం ఈలోపు నిర్మాతలు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము అని చెప్పారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న ఈ నిర్ణయం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి బెనిఫిట్ షోలు లేకపోతే సినిమా బృందానికి తీవ్ర నష్టమే కాకుండా సినిమాపై హైప్ లేకుండా పోతుంది. మరి డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయం పై నిర్మాతల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Read More: డ్రగ్స్ తీసుకున్న హేమ.. పేరు మార్చుకొని పార్టీకి హాజరు

Related News

ట్రెండింగ్ వార్తలు