August 5, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన దివంగత నటి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదల కాకుండానే రామ్ చరణ్ తో మరో సినిమాలో అవకాశం కూడా అందుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాలు షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న జాన్వి కపూర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా దేవర సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో ఉన్నటువంటి ఈమె అక్కడ మధ్యాహ్నం లంచ్ కి సంబంధించిన ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.డైనింగ్ టేబుల్‌పై బిర్యానీ, చికెన్, డిషెస్‌తోపాటు పలు శాఖాహార వంటకాలున్న స్టిల్ షేర్ చేస్తూ.. దేవర షూటింగ్‌ను ఇందుకే ప్రేమిస్తున్నానంటూ ఫైర్, లవ్ ఎమోజీలను క్యాప్షన్‌గా ఇచ్చింది. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం శంషాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో జాన్వీకపూర్, తారక్, ఇతర ఆర్టిస్టులపై వచ్చే భారీ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది