ఆక‌ట్టుకుంటోన్న ‘వరుడు కావలెను‘ ప్రేమ గీతం..

September 22, 2021

ఆక‌ట్టుకుంటోన్న ‘వరుడు కావలెను‘ ప్రేమ గీతం..

నాగశౌర్య, ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. ఈ చిత్రంలోని
‘‘మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ
పెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమా
ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం
అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం
” అంటూ సాగే మధురమైన గీతాన్ని విడుద‌ల చేశారు.

సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారింది.”గాయని చిన్మయి వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు ప్రాణం పోశాయి. ఈ పాట‌లో ‘నాగశౌర్య, రీతువర్మ‘ లు అభినయం కట్టిపడేస్తుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్ర‌ఫి బాగుంది.

ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగశౌర్య, రీతువర్మ నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ట్రెండింగ్ వార్తలు