ప్రభాస్ విషయంలో డైరెక్టర్లు చేస్తున్న పెద్ద తప్పు ఇదేనా.. డైరెక్టర్లు మారాల్సిందే?

July 3, 2024

ప్రభాస్ విషయంలో డైరెక్టర్లు చేస్తున్న పెద్ద తప్పు ఇదేనా.. డైరెక్టర్లు మారాల్సిందే?

Prabhas Movie Directors Mistakes: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల వరుస పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు అయితే ఈయన సినిమాలపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ విడుదలైన రోజే వందకోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తాయి. కానీ అనుకున్న స్థాయిలో సినిమా కలెక్షన్లను రాబట్ట లేకపోతున్నాయి.

ఇప్పటివరకు ప్రభాస్ నటించిన సాహో రాధే శ్యామ్, ఆది పురుష్, సోలార్ వంటి సినిమాలన్నీ కూడా ఇదే తరహాలోనే ప్రేక్షకులను కాస్త నిరుత్సాహ పరిచాయి. ఇక ఈ సినిమాల విషయంలో డైరెక్టర్లు చేసిన తప్పిదమే సినిమాలకు ఇలాంటి ఫలితాలు వచ్చాయని చెప్పాలి. ఒక పాన్ ఇండియా స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే ఆ సినిమాని తప్పనిసరిగా ప్రేక్షకులలోకి తీసుకు వెళ్లేలా సినిమాలను ప్రమోట్ చేయాలి.

ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా విడుదలకు ముందు వరకు షూటింగ్ పనులు జరుపుకుంటూనే ఉన్నాయి దీంతో ప్రమోషన్లకు పెద్దగా స్కోప్ లేకుండా పోతుంది. ఇలా సినిమాలకు సరైన స్థాయిలో ప్రమోషన్స్ లేకపోవడమే ఓకింత కలెక్షన్ల పై ప్రభావం చూపుతోందని కూడా చెప్పాలి. ఇప్పటివరకు ప్రభాస్ తో పనిచేసిన డైరెక్టర్లు అందరూ కూడా ఇదే తప్పును చేశారు. ఇకపై డైరెక్టర్లు ఈ తప్పును సరి చేసుకొని సినిమాలు తొందరగా పూర్తి చేసి ప్రమోషన్లకు కూడా సమయం కేటాయిస్తే బాగుంటుందని పలువురు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కల్కి సినిమా విషయానికొస్తే కల్కి సినిమా కూడా పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించలేదు ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏదో నామమాత్రంగా చేశారే తప్ప పెద్దగా ఫోకస్ చేయలేదని తెలుస్తుంది. ఇక ఏపీలో ఈ సినిమా వేడుక చాలా గ్రాండ్గా జరగబోతుందని వార్తలు వచ్చిన అసలు ఇక్కడ ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించలేకపోయారు. ఈ క్రమంలోనే ఇకపై ప్రభాస్ సినిమాల ప్రమోషన్ల విషయంలో డైరెక్టర్లు మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది

Related News

ట్రెండింగ్ వార్తలు