Anushka Shetty: నా కెరీర్లో చెత్త సినిమాలు అవే…ఆ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన అనుష్క!

July 10, 2024

Anushka Shetty: నా కెరీర్లో చెత్త సినిమాలు అవే…ఆ స్టార్ హీరోలకు షాక్ ఇచ్చిన అనుష్క!

Anushka Shetty: టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి సూపర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు నటి అనుష్క శెట్టి. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటిలోనే అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.. ఈ విధంగా అనుష్క ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంటున్న తరుణంలోనే కొన్ని ప్రయోగాత్మక సినిమాలు చేసి అధిక శరీర బరువు పెరిగారు.

Read MoreSamantha: సావిత్రిలా నా జీవితం కాకూడదు..అందుకే దూరమయ్యాను

ఇలా ఈమె పెరిగిన శరీర బరువు తగ్గించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న కూడా అది సాధ్యం కాలేదు ఈ క్రమంలోనే కొంతకాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చి తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న అనుష్క గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ సందర్భంగా టాలీవుడ్ హీరోల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ ఈమెను ప్రశ్నిస్తూ మీకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో తో కంఫర్టబుల్ గా ఉంటుంది రవితేజ, మహేష్ బాబు, గోపీచంద్ అంటూ మూడు పేర్లను చెప్పగా ఏమాత్రం ఆలోచించకుండా రవితేజతో చాలా కంఫర్టబుల్ గా ఉంటుందంటూ సమాధానం చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో బలాదూర్ విక్రమార్కుడు వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Read MoreNandamuri Balakrishna: అరుదైన రికార్డు సొంతం చేసుకున్న బాలయ్య..ఇది ఆయనకే సాధ్యం?

ఇక మీ కెరియర్ లో నటించిన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా ఇష్టం లేని సినిమాలు ఏంటి అని ప్రశ్నించారు ఇందుకు వేదం అరుంధతి సినిమాలో నాకు చాలా ఇష్టం అని తెలిపారు అలాగే కొన్ని చెత్త సినిమాలు కూడా ఉన్నాయి అలాంటి వాటిలో బాలయ్యతో కలిసి నటించిన ఒక్క మగాడు చిత్రం ఉందని ఈమె తెలిపారు. ఒకేసారి ఎన్టీఆర్ రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం వస్తే ఎవరితో చేస్తారని ప్రశ్నించగా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎన్టీఆర్ అంటూ సమాధానం చెప్పడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి

ట్రెండింగ్ వార్తలు