ఇండియన్‌ 2లో కాజల్‌ ప్లేస్‌లో న‌టిస్తోంది ఎవ‌రో తెలుసా!

July 6, 2022

ఇండియన్‌ 2లో కాజల్‌ ప్లేస్‌లో న‌టిస్తోంది ఎవ‌రో తెలుసా!

సక్సెస్‌ఫుల్‌ మూవీ ‘ఇండియన్‌’ (భారతీయుడు) సినిమాకు దర్శకుడు శంకర్, హీరో కమల్‌హాసన్‌ ఏ ముహూర్తాన శ్రీకారం చుట్టారో కానీ అడుగడుగున అవాంతరాలే ఎదురయ్యాయి. సినిమా షూటింగ్‌ అనుకున్న సమయాని కన్నా ఆలస్యంగా మొదలైంది. ఆ తర్వాత ఇండియన్‌ 2 సెట్‌లో భారీ ప్రమాదం జరిగింది. ఇద్దరు క్రూ మెంబర్స్‌ కూడా మరణించారు. ఆ నెక్ట్స్‌ బడ్జెట్‌ ఇష్యూతో శంకర్, ఈ చిత్రం నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ మధ్య గొడవలు మొదలైయ్యాయి. ఈ ఇష్యూ కోర్టు కేసుల వరకు వెళ్లింది. ఇలా ‘ఇండియన్‌ 2’ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా ఆగిపోయింది.

ఇటీవల ‘విక్రమ్‌’ సినిమాతో భారీ హిట్‌ అందుకున్నారు కమల్‌హాసన్‌. ఈ తరుణంలో ఇన్‌కంప్లీట్‌గా ఉన్న ‘ఇండియన్‌ 2’ కూడా సక్సెస్‌పుల్‌గా కంప్లీట్‌ చేస్తే మరో హిట్‌ తన ఖాతాలో చేరుతుందని కమల్‌ భావించిన ట్లు ఉన్నారు. దీంతో ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ను తిరిగి స్టార్ట్‌ చేసే ప్రయత్నాలు చేశారు. ఇవి సఫలమైయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో ఇండియన్‌ 2 షూటింగ్‌ తిరిగి మొదలవుతుందనే వార్తలు వస్తున్నాయి. కానీ ఈ చిత్రం హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. దీంతో ఈ చిత్రం యూనిట్‌ కాజల్‌ ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను చూస్తోంది. ఈ చాన్స్‌ తమన్నాకు దక్కిందనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు