ప్రభాస్ కి వర్షం సినిమా కాకుండా ఆ సినిమా పాటలు అంటే అంత ఇష్టమా..?

June 7, 2024

ప్రభాస్ కి వర్షం సినిమా కాకుండా ఆ సినిమా పాటలు అంటే అంత ఇష్టమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన అభిరుచులను గురించి వెల్లడించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఈయన తన సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించడమే కాకుండా ఆయన సినిమాలోని పాటలు ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలాగా ఉంటాయి. ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ ప్రభాస్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వర్షం సినిమాలో పాటలు అంటే తనకు చాలా ఇష్టమని ప్రతి చిత్రంలో దేవిశ్రీ సాంగ్స్ లో ఉండే సౌండింగ్ తనని సర్ప్రైజ్ చేస్తుందని ప్రభాస్ అన్నారు.

ఇక వర్షం సినిమా నా ఆల్ టైం ఫేవరెట్ ఆల్బమ్ అంటూ ప్రభాస్ తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత జల్సా సినిమాలో పాటలు విన్నా నాకు అదే అనుభూతి కలుగుతుందని తెలిపారు. ఇక జల్సా సినిమా తర్వాత మీరు చేసిన సినిమాలోని పండగల దిగివచ్చావే అనే పాట మొదటిసారి వినగానే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఈ పాటను ఏకంగా ఒక 150 సార్లు వరకు విని ఉంటానని ఈ సందర్భంగా తనకెంతో ఇష్టమైన పాటల గురించి ప్రభాస్ మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read More: బాబాయ్ పాదాలకు నమస్కరించిన గ్లోబల్ స్టార్.. సంస్కారానికి ఫిదా కావాల్సిందే?

ట్రెండింగ్ వార్తలు