Acharya Song: చిరంజీవి క్షమాపణలు చెప్పాలి!

January 7, 2022

Acharya Song: చిరంజీవి క్షమాపణలు చెప్పాలి!

Chiranjeevi Acharya: చిరంజీవి హీరోగా చేసిన ‘ఆచార్య’ సినిమాలోని ‘శానాకష్టం’ పాట లిరిక్స్‌లోని ‘ఎక్కడెక్కడో నిమరొచ్చు అని ఆర్‌ఎమ్‌పీ అయిపోతున్నారు’ అనే లిరిక్‌ ఉంది. దీంతో ఈ పాటలోని ఆ లిరిక్‌ను తొలగించడంతో పాటుగా,చిరంజీవి క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆర్‌ఎమ్‌పీ డాక్టర్లు కొందరు డిమాండ్‌ చేస్తున్నారట. మరి ఈ విషయంలో చిత్రయూనిట్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక ‘ఆచార్య’ చిత్రంలోని ఈ స్పెషల్‌సాంగ్‌కు భాస్కరభట్ల లిరిక్స్‌ అందించగా, సింగర్స్‌ రేవంత్‌ గీతా మాధురి పాడారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. ఇక చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ చిత్రం ఫిబ్రవరి 4నవిడుదల కావాల్సింది. కానీ ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసులు, ఏపీలోని టికెట్‌ ధరలు వంటి అంశాల కారణంగా ‘ఆచార్య’ చిత్రం వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి.

Read More: MaheshBabu: మహేశ్‌బాబుకు కరోనా పాజిటివ్‌.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..!

ట్రెండింగ్ వార్తలు