చంద్రబాబు ప్రమాణస్వీకారానికి దూరంగా బన్నీ తారక్… అదే ప్రధాన కారణమా?

June 12, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి దూరంగా బన్నీ తారక్… అదే ప్రధాన కారణమా?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలో కేసరపల్లి వద్ద ఈయన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అభిమానులు రాజకీయ నాయకులు కార్యకర్తలు సినీ సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అలాగే రజినీకాంత్ దంపతులకు ముఖ్య ఆహ్వానం అందింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి రజనీకాంత్ వేదికపై చోటు సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు. వారిలో ఎన్టీఆర్ అలాగే అల్లు అర్జున్ కూడా ఉన్నప్పటికీ వీరిద్దరూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇలా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినప్పటికీ ఇద్దరు హీరోలు దూరంగా ఉండటం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి వీరిద్దరికీ ఆహ్వానం అందిన రాలేని పరిస్థితులలో ఉన్నారని తెలుస్తుంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు .ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాలేకపోయారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ సైతం దేవర సినిమా షూటింగ్ పనుల నిమిత్తం గోవా వెళ్లారు. గోవాలో ఓ మారుమూల ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఇలా గోవాలో ఉన్న నేపథ్యంలోనే ఎన్టీఆర్ సైతం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

ఇటీవల రామోజీరావు మరణించిన సమయంలో కూడా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ పనులలో ఉన్న నేపథ్యంలో ఆయన చివరి చూపుకు కూడా నోచుకోలేదు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందినా షూటింగ్ పనుల కారణంగానే రాలేకపోయారని తెలుస్తుంది.

Read More: ఆ సినిమా 100 సార్లు చూసి ఉంటా.. మహేష్ బాబు కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు