ఈ వారం ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలు ఇవే?

June 21, 2024

ఈ వారం ఓటీటీలో విడుదల కాబోయే సినిమాలు ఇవే?

ప్రస్తుత కాలంలో ఓటీటీలు బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. అంతేకాకుండా మరికొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలైనప్పటికి నెల తిరగకుండానే ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇక ప్రతివారం ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే .మరి ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటి ఏ సినిమాలు ఎక్కడ ప్రసారం కాబోతున్నాయనే విషయానికి వస్తే..

గం గం గణేశా: ఇటీవల ఆనంద్ దేవరకొండ నటించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మే 31వ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అదే రోజు భారీ స్థాయిలో సినిమాలు విడుదల అయిన నేపథ్యంలో అనుకున్న స్థాయిలో ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ క్రమంలోనే థియేటర్లలో విడుదలైన 20 రోజులకే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులు చూడవచ్చు.

బాక్: సుందర్ సి దర్శకత్వంలో ఆయనే హీరోగా, తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం బాక్. ఈ సినిమా తమిళంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే జూన్ 21వ తేదీ నుంచి ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు మలయాళ హిందీ భాషలలో కూడా అందుబాటులోకి వచ్చింది.

నడిగర్ తిలగం: మలయాళ యంగ్ స్టార్ టోవినో థామస్ ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమా మే మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. జూన్ 21న ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

రాధా మాధవం: వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మార్చ్ 1న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాలో నటించిన వారంతా కొత్తవారే. ఇక ఈ సినిమా ఎలాంటి చప్పుడు లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

Read More: ఆ కారణంతోనే నేను మూడో బిడ్డను కనలేదు.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్!

Related News

ట్రెండింగ్ వార్తలు