December 15, 2021
అది ‘వినయ విధేయరామ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్..రామ్‌చరణ్ హీరోగా చేసిన ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి..డీవీవీ దానయ్య బ్యానర్‌లో త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నా అని ప్రకటించేశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమా…మెగాఫ్యాన్స్ సంబరపడి పోయారు. కట్ చేస్తే…ప్రస్తుతం డివీవీ బ్యానర్‌లో వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరంజీవి సినిమా వస్తుంది. మరి.. డీవీవీ బ్యానర్‌లో చిరంజీవితో సినిమాను త్రివిక్రమే వద్దనుకున్నారా? లేక త్రివిక్రమ్ కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా..ఈ విషయం నిర్మాత డీవీవీ దానయ్యకే తెలియాలి మరి.