July 24, 2024
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. అయితే ప్రతి ఒక్క హీరో కూడా ఎంత విభిన్నమైన పాత్రలలో నటించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కొన్నిసార్లు లవర్ బాయ్ గా మరికొన్నిసార్లు పొలిటీషియన్ గా మరికొన్నిసార్లు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మన తెలుగు చిత్ర పరిశ్రమలు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, గోపీచంద్, రవితేజ వంటి ఎంతోమంది స్టార్ హీరోలు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలు ఎన్నోసార్లు పోలీస్ యూనిఫామ్‌లో కనువిందు చేశారు అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగే పలువురు హీరోలు ఇప్పటివరకు ఇలాంటి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించలేదు. మరి ఇప్పటివరకు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించని ఆ స్టార్ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే..
పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఇప్పటివరకు విభిన్న పాత్రలలో నటించారు కానీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించలేదు. అయితే ఈయన తదుపరి చిత్రం స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని ఒక పోస్ట్ వైరల్ అయింది కానీ పూర్తి అధికారక సమాచారం మాత్రం వెలబడలేదు.
ఇక ఇండస్ట్రీలో టైర్ టు హీరోలుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నేచురల్ స్టార్ నాని అలాగే నటుడు విజయ్ దేవరకొండ కూడా ఒకరు. ఇద్దరు హీరోలు ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించారు. కానీ ఈ ఇద్దరు హీరోలు కూడా ఏ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించలేదు. ఈ విధంగా ఈ ముగ్గురు హీరోలు ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా ఖాకీ దుస్తులతో కనిపించలేదని చెప్పాలి.
Read More: BigBossTelugu8: ఈసారి హౌస్ లో సీనియర్ హీరో… రచ్చ మామూలుగా ఉండదు?