July 13, 2024
అంబానీ కుటుంబంలో పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే అనంత అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ముంబైలోని జియో వరల్డ్ లో వీరి వివాహ వేడుకలు అంబరాన్ని తాకాయి. ఇక ఈ వివాహ వేడుకకు ఎంతో మంది వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అలాగే సినిమా సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు.
ఇక మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి కూడా సెలబ్రిటీలందరూ పెద్ద ఎత్తున ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటు రానా మిహికా దంపతులు, మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు. ఇక సౌత్ ఇండస్ట్రీ తరపున రజనీకాంత్ కుటుంబ సభ్యులతో పాటు సూర్య ఫ్యామిలీతో పాటు రష్మిక మందన్న, రాశీ ఖన్నా, నయనతార ఈ వేడుకలో సందడి చేశారు.
ఇక అంబానీ పెళ్లి వేడుకలలో భాగంగా బాలీవుడ్ తారలు అందరు కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అనంత అంబానీ రాధిక మర్చంట్ వివాహ వేడుకకు ఏకంగా 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది అయితే ఈ ఖర్చు అంబానీ నికర ఆస్తులలో కేవలం 0.5% అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు