క్యాన్స‌ర్ బారిన మ‌రో టాలివుడ్ హీరోయిన్‌…

December 20, 2021

క్యాన్స‌ర్ బారిన మ‌రో టాలివుడ్ హీరోయిన్‌…

వంశీ అనుమాన‌స్ప‌దం చిత్రంతో తెలుగు వారికి ద‌గ్గ‌రైన న‌టి హంసా నందిని. ఆ త‌ర్వాత ప్ర‌భాస్ స‌ర‌స‌న ‘మిర్చి’,లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌ర‌స‌న‌ ‘అత్తారింటికి దారేది’లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసి యూత్ ఆడియ‌న్స్ కు చేరువైంది. సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోస్ హీటెక్కించే హంసా నందిని గత కొంతకాలంగా సోషల్‌మీడియా, సినిమాలకు దూరంగా ఉంటూ వ‌స్తోంది. దానికి కార‌ణం ఏంటో ఈ రోజు ఉద‌యం తెలిపింది. హంసా నందిని క్యాన్సర్‌ బారిన ప‌డ్డారు. ప్రస్తుతం ఆమె క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నానని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తానని తెలిపింది.

‘18 సంవత్సరాల క్రితం క్యాన్సర్‌తో నా తల్లి కన్నుమూశారు. నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతి ఉన్నట్లు అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించాను. పరీక్షల అనంతరం నాకు రొమ్ము క్యాన్సర్‌ గ్రేడ్‌-3 దశలో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. సర్జరీ చేసి ఆ కణతిని తొలగించారు. క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని భావించాను. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. జన్యుపరమైన క్యాన్సర్‌ ఉన్నట్లు వైద్యులు తాజాగా నిర్ధారించారు. దాని ప్రకారం బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 70శాతం లేదా గర్భాశయ క్యాన్సర్‌ బయటపడే అవకాశం 40 శాతం ఉంది. ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే సర్జరీలు చేయించుకోవడం ఒక్కటే దారి. ప్రస్తుతానికి 9 విడతల కిమోథెరపీలు చేయించుకున్నాను. మరో ఏడు చేయించుకోవాల్సి ఉంది. ఈ మహమ్మారికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకోవడం లేదు. నవ్వుతూ ధైర్యంగా పోరాడాలనుకుంటున్నా. సంపూర్ణ ఆరోగ్యంతో మరలా మీ ముందుకువస్తా. అందరిలో ప్రేరణనింపడానికే నా కథ చెబుతున్నా’’ అని హంసానందిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు