హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగుతున్న టాలీవుడ్‌ స్టార్స్‌…

December 16, 2021

హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగుతున్న టాలీవుడ్‌ స్టార్స్‌…

హీరోల వరుస సర్జరీలు టాలీవుడ్‌ను కంగారుపెడుతున్నాయి. రీసెంట్‌గా ‘సర్కారువారిపాట’ సినిమాకు చెందిన సాంగ్‌ షూట్‌లో భాగంగా మహేశ్‌ గాయపడ్డారు. దీంతో స్పెయిన్‌లో మెకాలికి చికిత్స చేయించుకున్న మహేశ్‌ ప్రస్తుతం ఫారిన్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నారు. అలాగే అఖండ చిత్రంలోని జై బాలయ్య సాంగ్‌ప్రాక్టీస్‌లో భాగంగా ఇంట్లో గాయపడ్డ బాలకృష్ణ కుడిచేతికి సర్జరీ జరిగింది. ఒక ‘గాడ్‌ఫాదర్‌’ షూటింగ్‌కు పాల్గొనే ముందు చిరంజీవి కుడిచేతికి సర్జరీ జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే జిమ్‌ ప్రాక్టీస్‌లో భాగంగా ఎన్టీఆర్‌ కుడిచేతి బోటనవేలికి స్మాల్‌ సర్జరీ జరిగింది. సేమ్‌ జిమ్‌ ప్రాక్టీస్‌లో భాగంగానే హీరో రామ్‌ హాస్పిటల్‌కి వెళ్లొచ్చారు. సాయిథరమ్‌తేజ్‌ అయితే ఓ పెనుప్రమాదం నుంచే తప్పించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయితేజ్‌ ఆ తర్వాత సరైన చికిత్సతో ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఇంకా ధనుష్‌ చిత్రం సెట్స్‌లో గాయపడ్డారు ప్రకాశ్‌రాజ్‌. హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ‘మహా సముద్రం’ షూటింగ్‌కు ముందు చేతికి సర్జరీ కోసం ఫారిన్‌ వెళ్లొచ్చారు సిద్దార్థ్‌.

ట్రెండింగ్ వార్తలు