ఇదేం అన్యాయం..సామీ!

January 8, 2022

ఇదేం అన్యాయం..సామీ!

PUSHPA ‘పుష్ప’ చిత్రంలోని తొలి పార్టు‘పుష్ప:ది రైజ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్నా ప్రేక్షకులు మెప్పించారు. డిసెంబరు 17న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఈ నెల 7 నుంచి అమోజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. కానీ రష్మికా మందన్నా ఫ్యాన్స్‌ మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే…స్ట్రీమింగ్‌ అవుతున్న ‘పుష్ప: ది రైజ్‌’ టైటిల్‌ కార్డులో రష్మికా మందన్నా పేరు తప్పుగా కనిపిస్తోంది. రష్మికా మడోన్నాగా కనిపిస్తుంది. సినిమాలో రష్మికా అంత కష్టపడితే ..పేరు తప్పుగా రావడం ఏంటి అని కొందరు నెటిజన్లు, రష్మికా ఫ్యాన్స్‌ కాస్త బాధగా ఫీలవుతున్నారు. ఇక ‘పుష్ప’లో రెండో భాగమైన ‘పుష్ప: ది రూల్‌’ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుంది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ చిత్రం నెక్ట్స్‌ పార్టు షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. కరోనా కేసులు లేక పోతే ఫిబ్రవరిలో స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు.

Readmoreఅల్లు అర్జున్‌పై కరణ్‌ జోహర్‌ షాకింగ్‌ కామెంట్స్‌.. ఏమన్నాడంటే?

ట్రెండింగ్ వార్తలు