January 7, 2022
మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు కరోనా సోకింది. ఇప్పటికే మహేశ్‌బాబుకు కరోనా సోకిన విషయం తెలిసిందే. మహేశ్ 28వ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్‌లో భాగంగా త్రివిక్రమ్, తమన్, సూర్యదేవర నాగవంశీ దుబాయ్ వెళ్లి వచ్చారు. అక్కడ మహేశ్‌బాబును కలిశారు. ఈ తరుణంలో తమన్‌కు కూడా కరోనా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తమన్ ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు. కానీ ఈ నెల 14న విడు దలకు సిద్ధమైన ‘డీజేటిల్లు’ సినిమాకు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కానీ ఇప్పుడు తమన్‌కు కరోనా. దీంతో అసలు ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొని ఉంది.
Read More: ఒకే రోజు నాలుగు సినిమాలు..బంగార్రాజుకు పోటీగా ఆ మూడు చిత్రాలు