సీరియల్ నటుడు చందు, పవిత్ర బంధం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

May 18, 2024

సీరియల్ నటుడు చందు, పవిత్ర బంధం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

నటి పవిత్రతో ఉన్న సంబంధం వలనే తమ జీవితాలు వీధిన పడ్డాయని సీరియల్ నటుడు, నిన్న ఆత్మహత్య చేసుకున్న చందు భార్య శిల్ప మీడియాకు తెలిపారు. చందు సూసైడ్ చేసుకున్న తర్వాత ఆమె సంచలన విషయాలు బయట పెట్టింది. స్కూల్ డేస్ నుంచే తనకు, చందుకు పరిచయం ఉందని.. అప్పుడు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఆమె తెలిపారు.

తనను చాలా ప్రేమగా చూసుకున్నారని అన్నారు. కానీ, త్రినయని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత తమ జీవితాలు పూర్తిగా మారిపోయాయని శిల్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీరియల్ లో నటిస్తున్న పవిత్రతో సంబంధం మొదలైన తర్వాత తనను, తన పిల్లలను చందు దూరం పెట్టాడని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఏకంగా ఐదేళ్లుగా తనతో మాట్లాటం మానేశారని చెప్పింది. ఎప్పుడైనా కాల్ చేస్తే పిల్లలతో మాత్రమే మాట్లాడేవాడని శిల్ప మీడియాకు తెలిపారు.

పవిత్ర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లాడని.. కానీ, కొన్నాళ్ల తర్వాత అయినా తమ దగ్గరకు వస్తాడనుకున్నామని ఆమె చెప్పింది. కానీ.. పవిత్ర కోసం ఏకంగా ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదని శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది. పవిత్ర చనిపోయిన 3 రోజుల తర్వాత చేయికోసుకున్నాడని.. ఆ తర్వాత పవిత్ర నీ దగ్గరకు వస్తున్నానని ఇన్‌స్టా‌గ్రాంలో పోస్టు పెట్టాడని ఆమె తెలిపారు. దీంతో తెలిసిన వాళ్లను ఫ్లాటు పంపిచేసరికే ఆత్మహత్య చేసుకున్నాడని శిల్ప ఆవేదన వ్యక్తం చేశారు.

Read More: భర్తతో కలిసి కొండకోనల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న యాంకరమ్మ!

Related News

ట్రెండింగ్ వార్తలు