నయనతారతో గొడవలు నిజమే…విభేదాలపై నోరు విప్పిన త్రిష!

June 29, 2024

నయనతారతో గొడవలు నిజమే…విభేదాలపై నోరు విప్పిన త్రిష!

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతున్న వారిలో త్రిష, నయనతార వంటి స్టార్ హీరోయిన్లు ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి అవుతున్న ఇప్పటికి హీరోయిన్లుగా స్టార్ హీరోల సరసన సినిమా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. నయనతార త్రిష ఇతరులు కూడా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించడమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.

ఇలా ఈ హీరోయిన్లు ఇప్పటికీ వరుస సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా రెమ్యూనరేషన్ విషయంలో కూడా పోటీ పడుతూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఒక్కో సినిమాకు సుమారు 12కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటూ సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లుగా గుర్తింపు పొందారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వీరిద్దరి మధ్య వృత్తి పరంగా కొన్ని విభేదాలు వచ్చాయని, ఆ విభేదాల కారణంగా ఇప్పటికీ వీరి మధ్య మాటలు లేవు అంటూ ఒకానొక సమయంలో ఒక వార్త వైరల్ గా మారింది. అయితే నయనతారతో గొడవల గురించి వచ్చిన ఈ వార్తలపై ఇటీవల త్రిష స్పందించారు. ఈ సందర్భంగా నయన తారతో గొడవ గురించి త్రిష మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

నయనతారతో నాకు గొడవలు ఉన్నాయి అంటూ వస్తున్నటువంటి వార్తలు నిజమేనని తెలిపారు..అయితే మా ఇద్దరి మధ్య వృత్తిపరమైన విభేదాలు కాదని వ్యక్తిగత విభేదాలని తెలియజేశారు. తొందరపాటు తనంతో ఇద్దరం అపార్థాలు చేసుకున్నామని అయితే తర్వాత మేం చేసిన తప్పు ఏంటో తెలుసుకొని మా ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయాయని త్రిష ఈ సందర్భంగా వెల్లడించారు. మరి వీరిద్దరి మధ్య వచ్చిన ఆ వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఏంటి అనే విషయాలను మాత్రం ఈమె వెల్లడించలేదు.

ట్రెండింగ్ వార్తలు