త్రిష ‘ఐడెంటిటీ’ పూర్తి!

May 14, 2024

త్రిష ‘ఐడెంటిటీ’ పూర్తి!

హీరోయిన్ త్రిష మలయాళం స్టార్ హీరో టోవినో థామస్ తో కలిసి ఐడెంటిటీ అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను కంప్లీట్ చేసుకుంది త్రిష. ఇన్స్టా వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ ఫోటోలను కూడా షేర్ చేసింది మూవీ టీం. ఐడెంటిటీ చిత్రంలో త్రిష పాత్ర షూటింగ్ ముగిసింది. ఇంతటి బిజీ షెడ్యూల్లో కూడా ఆమె మా ప్రాజెక్టులో భాగమైనందుకు ఆనందంగా ఉంది.

మా మీద నమ్మకం ఉంచి మాకు సహకరించినందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది మూవీ టీం. ఈ సినిమాలో వినయ్ రాయ్, మందిరా బేడి, షమ్మీ తిలకన్, అర్చన కవి తో సహా మరికొందరు నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా కాకుండా త్రిష విశ్వంభర సినిమాలో మెగాస్టార్ తో నటిస్తుంది.

షోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ తో థగ్ లైఫ్ సినిమాతో పాటు విదాముయార్చి అనే సినిమాలో కూడా నటిస్తుంది. త్రిష ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు అయినప్పటికీ సినిమాల మీద సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉంది. గత ఏడాది లియో చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది త్రిష.

సౌత్ ఇండియా సినిమాలే కాకుండా బాలీవుడ్ లో కూడా విజయకేతనం ఎగురవేసేందుకు రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 2014లో విడుదలైన కామెడీ చిత్రం కట్టామీఠాలో నటించిన త్రిష ఆ తర్వాత మళ్లీ హిందీలో నటించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ లోకి రీయంట్రీ ఇస్తుంది. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా సికిందర్ లో రష్మిక తో పాటు త్రిష కూడా నటించబోతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సమాచారానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది.

Read More: కుర్రకారుతో పోటీ పడుతున్న రజనీకాంత్.. ఫుల్ ఖుషి లో ఫ్యాన్స్!

Related News

ట్రెండింగ్ వార్తలు