ఇప్పటికీ ఆ కోరిక తీరలేదు… వింత కోరికను బయటపెట్టిన త్రిష!

May 28, 2024

ఇప్పటికీ ఆ కోరిక తీరలేదు… వింత కోరికను బయటపెట్టిన త్రిష!

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి వారిలో నటి త్రిష ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికి హీరోయిన్గా అవకాశాలు అందుకొంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్రిష ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో కూడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నారు.. ఈమె సినీ కెరియర్ మధ్యలో కాస్త చిన్న విరామం ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మాత్రం వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు.

తమిళంలో విజయ్ , అజిత్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తున్నటువంటి ఈమె తెలుగులో చిరంజీవి నాగార్జున వంటి స్టార్ హీరోలు సినిమాలలో నటిస్తున్నారు. నాగార్జున తన వందవ సినిమాలో త్రిష నటిస్తూ ఉండగా చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న విశ్వంభర సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి త్రిష ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ తన మనసులో ఉన్నటువంటి ఒక వింత కోరికను బయట పెట్టారు తనకు ఎప్పటినుంచో ఒక రోజైనా అబ్బాయిగా మారాలి అనే కోరిక ఉంది అంటూ ఒక విచిత్రమైన వింత కోరికను బయటపెట్టారు. ఒక అబ్బాయి తన ఆలోచన ధోరణి ఎలా కలిగి ఉంటారు తన వ్యక్తిత్వం ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలని ఉందని ఈమె తెలిపారు.

ఈ విషయాలన్ని తెలుసుకోవడం కోసం తాను ఒకరోజు అబ్బాయిగా మారాలనుకుంటున్నానని ఇదే విషయం మా అమ్మతో చెబితే తాను నవ్వుతుందని త్రిష తెలిపారు. ఈ విధంగా త్రిష తన మనసులో ఉన్నటువంటి ఈ వింత కోరికను బయట పెట్టడంతో నైటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పుడు కూడా పెద్ద తేడా ఏమీ లేదులే అలాగే కనిపిస్తున్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు మగాడిగా మారాలనుకుంటే సర్జరీ చేయించుకో అంటూ ఉచిత సలహాలు ఇస్తూ కామెంట్ చేస్తున్నారు.

Read More: ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు