నాగ్ అశ్విన్ కి సెంటిమెంట్ గా మారిన సెలబ్రిటీలు.. ప్రతి సినిమాలో ఉండాల్సిందేనా?

June 26, 2024

నాగ్ అశ్విన్ కి సెంటిమెంట్ గా మారిన సెలబ్రిటీలు.. ప్రతి సినిమాలో ఉండాల్సిందేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈయన త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి ఇక ఈ సినిమా కనుక సక్సెస్ అయితే ఈయన కూడా పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఇతర నటీనటులు కూడా భాగమైన సంగతి మనకు తెలిసిందే.

ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైతం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈయన సినిమాలకు హిట్ సెంటిమెంట్ కూడా ఉందని అయితే ఇద్దరు సెలబ్రిటీలను కనుక సినిమాలలో భాగం చేస్తే సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.

నాగీ(నాగ్ అశ్విన్) డైరెక్షన్లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు మాళవిక నాయక్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకు అనంతరం వీటిద్దరూ మహానటి సినిమాలో కూడా నటించారు. విజయ్ జర్నలిస్టు పాత్రలో నటించగా మాళవిక జెమినీ గణేష్ మొదటి భార్య పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇప్పుడు రాబోయే కల్కి సినిమాలో కూడా వీరిద్దరూ నటించారని తెలుస్తుంది.

ఈయన డైరెక్షన్లో వచ్చిన గత రెండు సినిమాలలో విజయ్ దేవరకొండ మాళవిక నాయర్ నటించారు. అయితే ఆ రెండు హిట్ అయ్యాయి. అదే సెంటిమెంట్ కల్కి విషయంలో కూడా రిపీట్ కాబోతుందని ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంటుంది అంటూ అభిమానులు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అవుతుందా లేదా అనేది మరి కొన్ని గంటలలో తెలియనుంది

Read MoreKalyani Priyadarshan: చీరకట్టులో చూడముచ్చటగా కల్యాణి ప్రియదర్శన్

ట్రెండింగ్ వార్తలు