ఎన్టీఆర్ దేవర కారణంగా ఆ హీరోలకు భారీ నష్టం.. కంగారులో ఫ్యాన్స్!

June 15, 2024

ఎన్టీఆర్ దేవర కారణంగా ఆ హీరోలకు భారీ నష్టం.. కంగారులో ఫ్యాన్స్!

పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా పనులలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా నిమిషానికి అక్టోబర్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో సెప్టెంబర్ 27వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇలా ఈ సినిమా అక్టోబర్ నెలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో రవితేజ మిస్టర్ బచ్చన్, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ వంటి సినిమాలు సెప్టెంబర్ 27న విడుదలను ఫిక్స్ చేసుకున్నాయి. ఇక ఈ సినిమాలకు పోటీగా దేవర సినిమా అదేరోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇద్దరి హీరోలకు భారీ నష్టం తప్పదని తెలుస్తుంది. ఇప్పటికే దేవర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కనుక మంచి టాక్ సొంతం చేసుకుంటే ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాకే బ్రహ్మరథం పడతారు.

ఇప్పటికే వరుస ఫ్లాపాలతో సతమతమవుతున్న రవితేజకు దేవర ఎఫెక్ట్ పడితే కోలుకోలేని నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పాలి అలాగే దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ పై దేవర ఎఫెక్ట్ పడితే నిర్మాతలు భారీగా నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలా ఎన్టీఆర్ కి పోటీగా రవితేజ దుల్కర్ సల్మాన్ బరిలోకి దిగుతున్నారనే విషయం అభిమానులను కంగారు పెడుతుంది. అయితే ఈ సినిమా కూడా అదే రోజు విడుదల కానున్న నేపథ్యంలో రవితేజ దుల్కర్ ఇద్దరు కూడా వెనకడుగు వేసి తమ సినిమాలను వాయిదా వేసుకుంటారా లేకపోతే ఎన్టీఆర్ కి పోటీగా సినిమాలను విడుదల చేస్తారా అనేది తెలియనుంది.

Read More: ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కల్కి తీసాము.. అది సిల్లిగా అనిపించింది: నాగ్ అశ్విన్

ట్రెండింగ్ వార్తలు