కల్కి సినిమాలో దీపిక రోల్ మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?

July 3, 2024

కల్కి సినిమాలో దీపిక రోల్ మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కల్కి. ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ ప్రేక్షకులు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సుమారు 600 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే అయితే మూడు రోజుల వ్యవధిలోని సుమారు 500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి సంచలనాలను సృష్టిస్తుంది.

ఇక కల్కి సినిమాలో ప్రభాస్ మాత్రమే కాకుండా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు భాగమైన సంగతి మనకు తెలిసిందే రాజమౌళి నుంచి మొదలుకొని రాంగోపాల్ వర్మ దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ దీశా పటాని, కమల్ హాసన్ అమితాబ్ వంటి స్టార్ సెలబ్రిటీలందరూ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.

ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో దీపికా పదుకొనే నటించిన సంగతి మనకు తెలిసినదే .ఈ సినిమాలో కూడా ఈమె ప్రెగ్నెంట్ పాత్రలో నటించారు. సుమతి అనే పాత్రలో నటించిన ఈమె ఈ సినిమా విజయానికి సూత్రధారిగా మారిపోయారు. ఇలా దీపికా పదుకొనే పాత్ర కూడా ఈ సినిమాకు హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా విడుదలయ్యి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దీపిక పదుకొనే పాత్రలో దీపిక కాకుండా ముందుగా మరో హీరోయిన్ కి ఛాన్స్ వచ్చిందట. ప్రభాస్ తో కలిసి రాదేశ్యామ్ సినిమాలో నటించిన నటి పూజా హెగ్డేకు తిరిగి కల్కి సినిమాలో కూడా నటించే అవకాశం వచ్చిందట కానీ రాదేశ్యామ్ సినిమాలో ఈమె సరైన హావభావాలు ఇవ్వకపోవడం వల్లే ఈ సినిమా సక్సెస్ కాలేక పోయింది అనే వాదన కూడా వెలుగులోకి వచ్చింది.

ఇలా ప్రభాస్ తో కలిసి ఈమె నటించిన రాదేశ్యామ్ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతోనే మేకర్స్ కల్కి సినిమాలో పూజను తీసుకోవాలనే ఆలోచన విరమించుకొని పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కావడంతో బాలీవుడ్ మార్కెట్ కోసం అమితాబ్ దీపిక వంటి వారిని తీసుకున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది

Related News

ట్రెండింగ్ వార్తలు