క్లిన్ కార ఫస్ట్ బర్త్ డే.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఉపాసన!

June 20, 2024

క్లిన్ కార ఫస్ట్ బర్త్ డే.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఉపాసన!

Klin Kaara Birthday: మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా నేడు మొదటి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. గత ఏడాది ఈమె జన్మించిన సంగతి మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లైన 11 సంవత్సరాలకు ఈ చిన్నారి జన్మించడంతో ఇటు మెగా అభిమానులు అటు మెగా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ చిన్నారి జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి అదృష్టం మామూలుగా కలిసి రావడం లేదు.

మెగా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో ఉన్నత గౌరవాలను అందుకుంటు ఉన్నారు. రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు గెలుపొందారు. చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏకంగా ఉపముఖ్యమంత్రిగా మారిపోయారు, వరుణ్ సందేశ్ పెళ్లి కూడా జరిగింది ఇలా అని శుభాలే జరిగాయి. దీంతో ఈ చిన్నారి మెగా కుటుంబానికి అదృష్టవంతురాలు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఇకపోతే నేడు క్లీన్ కారా పుట్టినరోజు కావడంతో ఉపాసన సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ.. క్లిన్ కారా జీవితంలోకి రావడంతో తన జీవితం పరిపూర్ణమైందని తెలిపారు. అంతేకాకుండా తన ప్రేగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ఒక వీడియోని కూడా షేర్ చేశారు ఇందులో రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా ఎమోషనల్ అయ్యారు 11 సంవత్సరాలు పెళ్లయింది ఎక్కడికి వెళ్లినా పిల్లలు ఎప్పుడు అంటూ అడిగే ప్రశ్నలు మమ్మల్ని బాధపెట్టాయని ఫైనల్ గా తనని తమ చేతులలోకి తీసుకున్నప్పుడు కలిగిన ఆనందం మాటలలో వర్ణించలేనిది అంటూ వీరిద్దరూ ఎమోషనల్ అవుతూ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియోని తాను ఒక మిలియన్ టైమ్స్ చూసి ఉంటానని ఉపాసన కూడా చెప్పుకోవచ్చారు. ఇక ఉపాసన మొదటి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఫోటోలను ఇప్పటికైనా బయటకు రివీల్ చేస్తారా లేదా అని అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక చిన్నారి జన్మించి సంవత్సరమైనప్పటికీ ఎక్కడ తన ఫోటోలను షేర్ చేయలేదు ఒకవేళ చేసిన తన ఫేస్ కనపడకుండా ఉపాసన జాగ్రత్త పడ్డారు.

Read More: చెప్పు తీసుకొని కొడతా.. జబర్దస్త్ కమెడియన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ?

ట్రెండింగ్ వార్తలు