మరో ఉన్నత గౌరవాన్ని సొంతం చేసుకున్న మెగా కోడలు ఉపాసన!

June 8, 2024

మరో ఉన్నత గౌరవాన్ని సొంతం చేసుకున్న మెగా కోడలు ఉపాసన!

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపోలో హాస్పిటల్ వైఫ్ ప్రెసిడెంట్ గా హాస్పిటల్ బాధ్యతలు ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నటువంటి ఈమె ఇతర వ్యాపార రంగాలలో కూడా ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్నారు. ఇలా బిజినెస్ వ్యవహారాలు మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఎంతోమందికి తన అపోలో హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఉపాసన ఇప్పటికే మంచి పేరు ప్రఖ్యాతలు అందుకున్నారు.

ఇకపోతే తాజాగా ఈమె మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేస్తున్న వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ లో ఇండియా విభాగానికి ఆమె నేషనల్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు ఉపాసన. ఇక ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్‌ డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి అధికారికంగా ప్రకటించారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా, అపోలో హాస్పిటల్‌ ట్రస్ట్‌ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. నాలుగేళ్ల పాటు ఉపాసన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాలలో గాయపడినటువంటి జంతువులకు ఉచితంగా వైద్యం అందించడం అదేవిధంగా ఆ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి అటవీశాఖ సిబ్బంది కూడా గాయాలు పాలైతే వారందరికీ కూడా అపోలో హాస్పిటల్స్ తరఫున ఉచిత చికిత్సను అందించబోతున్నారు.

ఈ విధంగా ఉపాసన వరల్డ్ వైడ్ ఫర్ నేచర్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులు కావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గత ఏడాది నుంచి మెగా కుటుంబానికి అన్ని శుభాలే కలుగుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు.

Read More: రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి.. ఎమోషనల్ అయిన రాజమౌళి!

ట్రెండింగ్ వార్తలు