ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఉపాసన తాతయ్య.. ఏం జరిగిందో తెలుసా?

June 6, 2024

ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఉపాసన తాతయ్య.. ఏం జరిగిందో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగా కుటుంబం గురించి పరిచయం అవసరం లేదు. అయితే మెగా కుటుంబానికి కోడలుగా ప్రముఖ బిజినెస్ ఉమెన్ అపోలో హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ ఉపాసన అడుగుపెట్టారు. ఇక ఉపాసన మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టినప్పటి నుంచి మెగా ఇంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతూనే వచ్చాయి.

ఇక ఉపాసన తాతయ్య ప్రతాపరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపోలో హాస్పిటల్ ఫౌండర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు .ఇక తాతయ్య ప్రతాపరెడ్డి కీర్తి ప్రతిష్టల గురించి ఉపాసన కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఇలా అపోలో హాస్పిటల్ అనే ఒక వ్యవస్థను స్థాపించినటువంటి ఈయన తన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను సాధించి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. అయితే తాజాగా ప్రతాపరెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలుస్తుంది. ఈయన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ప్రతాపరెడ్డి ప్రయాణిస్తున్నటువంటి ఈ కారుపై ఒక వ్యాన్ దూసుకు రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో వీరికి స్వల్ప గాయాలు మాత్రం అయ్యాయి. ఇక ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే చెన్నైలో పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ ప్రమాదంలో భయపడాల్సిన పనిలేదని ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని తెలుస్తోంది.

Read More: ఆమెతో నటించడం నావల్ల కాదు.. నటుడు విజయ్ కామెంట్స్ వైరల్!

Related News

ట్రెండింగ్ వార్తలు