క్లిన్ కారాతో పవన్ కళ్యాణ్.. అరుదైన ఫోటోని షేర్ చేసిన ఉపాసన!

June 13, 2024

క్లిన్ కారాతో పవన్ కళ్యాణ్.. అరుదైన ఫోటోని షేర్ చేసిన ఉపాసన!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. రాజకీయాలలో ఈయన సంచలనమైన విజయం సాధించారు. ఇలా రాజకీయాల పరంగా అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ విజయాన్ని మెగా కుటుంబ సభ్యులందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరిగింది.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి ఉపాసన దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారని తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో మెగా కుటుంబ సభ్యులు దిగిన ఫోటోలని కూడా షేర్ చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కుమార్తె క్లిన్ కారను ఆడిస్తూ ఉన్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుణ్ తేజ్ పెళ్లిలో భాగంగా ఉపాసన తన కుమార్తెను ఎత్తుకొని ఉండగా పవన్ కళ్యాణ్ తనని ముద్దు చేస్తూ ఆడిస్తూ ఉన్నట్టు కనిపించారు. పక్కనే రామ్ చరణ్ కూడా ఉండటం విశేషం ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అభినందనలు తెలిపారు..

ఇలా తన మనవరాలతో పవన్ కళ్యాణ్ కనిపించిన ఈ అరుదైన ఫోటో బయటకు రావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కు ఏ శాఖ ఇవ్వబోతున్నారనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈయనకు డిప్యూటీ సీఎంతో పాటు మరొక మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని అందరూ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

Read More: గాయాలు పాలైన నటి లావణ్య త్రిపాఠి.. ఆందోళనలో మెగా ఫ్యామిలీ.. ఏమైందంటే?

ట్రెండింగ్ వార్తలు