ఈ వారం థియేట‌ర్‌, ఓటీటీలో రిలీజ‌య్యే చిత్రాలు

April 25, 2022

ఈ వారం థియేట‌ర్‌, ఓటీటీలో రిలీజ‌య్యే చిత్రాలు

గ‌త వారం చెప్పుకోద‌గ్గ సినిమాలేం రిలీజ్ కాక‌పోవ‌డంతో ఇంకా బాక్సాఫీస్‌ వద్ద ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌2’ల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్‌ చివరి వారంలో ఓటీటీ మ‌రియు థియేట‌ర్స్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలివే..

విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత ట్రైయాంగిల్ ల‌వ్‌స్టోరి

Kanmani Rambo Khatija

విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత కీలక పాత్రల్లో విఘ్నేశ్‌ శివన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కాతు వాక్కుల రెండు కాదల్‌’. తెలుగులో ‘కణ్మని రాంబో ఖతీజా’పేరుతో విడుదల కానుంది. ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తే అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? ఇద్దరితోనూ అతను పడిన కష్టాలేంటి? చివరకు ఇద్దరి మనసులను గెలుచుకున్నాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఏప్రిల్‌ 28న ‘కణ్మని రాంబో ఖతీజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘చిరు చిరుత’ల బాక్స్ ఆఫీస్ వేట ఆచార్య‌.

Acharya

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేస్తున్న చిరంజీవి ఈ వారం ‘ఆచార్య’గా అలరించబోతున్నారు. కమర్షియల్‌ సినిమాల్లో మంచి సోష‌ల్ మెసేజ్ మిక్స్ చేసి అద్భుద‌మైన విజ‌యాలు సాధించిన‌ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో రామ్‌చరణ్‌ఓ కీలక పాత్ర పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తండ్రీకొడుకుల మేజిక్‌ చూడాలంటే ఏప్రిల్‌ 29వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.

అమితాబ్‌, అజయ్‌దేవగణ్, ర‌కుల్ ప్రీత్ సింగ్ ‘రన్‌ వే 34’

Runway34

బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌దేవగణ్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రన్‌వే 34’. అమితాబ్‌ బచ్చన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. 2015లో విమానయాన రంగం లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌

Gangubhai

* గంగూబాయి కథియావాడి(తెలుగు) ఏప్రిల్‌ 26

* 365 డేస్‌: ది డే(హాలీవుడ్‌)

* మిషన్‌ ఇంపాజిబుల్‌ (తెలుగు) ఏప్రిల్‌ 29

*ఓ జార్క్‌ (వెబ్‌ సిరీస్‌) ఏప్రిల్‌29

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

* అనుపమా: నమస్తే అమెరికా (హిందీ) ఏప్రిల్‌ 25

జీ5 * నెవర్‌ కిస్‌ యువర్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ (హిందీ) ఏప్రిల్‌ 29

ట్రెండింగ్ వార్తలు