గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఉర్ఫీ జావెద్.. ముఖమంతా వాచిపోయి అలా?

June 4, 2024

గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఉర్ఫీ జావెద్.. ముఖమంతా వాచిపోయి అలా?

బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఉర్ఫీ జావేద్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె చిత్ర విచిత్రమైన వేషధారణ. విచిత్రమైన వేషధారణతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ ని కూడా ఉంటుంది. కాగా ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్ లతో, విచిత్రమైన వేషధారణతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఉర్ఫీ జావేద్ ఎక్కువగా తన వస్త్రధారణతోనే ఆమె బాగా పాపులర్ అయింది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు ఉర్ఫీ జావేద్ కు ఏమయ్యింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా ఉర్ఫీ జావేద్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో ఆమె మొఖం గుర్తుపట్టలేని విధంగా కళ్ళు ముఖము పెదాలు అన్ని వాచిపోయాయి.

తనతో ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉర్ఫీ జావెద్ తాజాగా ఒక పోస్ట్ వేసింది. తనకున్న సమస్య గురించి బహిరంగంగా మరోసారి పోస్ట్ వేసింది. గతంలోనూ ఇలానే ఒక సారి తన పెదవులకు చేసుకున్న సర్జరీ గురించి చెప్పింది. ఇలా నాసిరకంగా సర్జరీలు చేయించుకోవద్దని, వికటిస్తాయని సలహాలు ఇచ్చింది. తనకు 18వ ఏట నుంచి ఎలర్జీ సమస్యలు వచ్చాయని, వాటికి చికిత్స కూడా తీసుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చింది. మధ్య మధ్యలో ఇలా తన మొహం, పెదవులు వాచిపోతుంటాయని ఆమె తెలిపింది. తాజాగా మళ్లీ ఇదే విషయాన్ని చెబుతూ ఉర్ఫీ జావెద్ పోస్ట్ వేసింది. తెల్లారిలేస్తే తన మొహం ఇలానే ఉంటుందని, తనకు ఎలర్జీ ఎక్కువ అవుతోందని, ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను అని ఉర్ఫీ జావెద్ తెలిపింది. ఇకపైనా తన మొహాన్ని ఇలా చూసినప్పుడు సలహాలు ఇవ్వకండని, కాస్త జాలి చూపించండని కోరింది. ఉర్ఫీ వేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Read More: మూడవ సారి తండ్రి అయిన తమిళ హీరో.. నెట్టింట పోస్ట్ వైరల్?

ట్రెండింగ్ వార్తలు