December 19, 2021
ప్రస్తుతం థియేటర్స్‌లో రన్ అవుతున్న పుష్ప చిత్రంలో అల్లు అర్జున్, రష్మికా మందన్నాల మధ్య కారులో రొమాన్స్ చేసే ఓ సీన్ ఉంటుంది. ఇదీ కాస్త సుకుమార్ స్టైల్ ఆఫ్ టేకింగ్‌కు కాస్త డిఫరెంట్‌గా..నిజంగా చెప్పాలంటే చాలా అసహ్యాంగా ఉంటుంది. థియేటర్స్‌లో ఈ సీన్ చేసే ఎవరైనా కాస్త ఇబ్బందికీ లోనవుతారు. ఈ సీన్ పట్ల ఆడియన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పైగా ఈ సీన్ ఉన్నప్పుడు థియేటర్స్‌లో సినిమా చూసినవారు ఎవరూ ఫ్యామిలీని థియేటర్స్‌కు తీసుకురావాలని అనుకోరు. కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న ‘పుష్ప’ అండ్ కో…ఈ సీన్‌ను డిలీట్ చేసింది. కానీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఫలానా చిత్రంలో ఫలనా సీన్ ఉందని తెలుస్తుంది కానీ..తీసేశా రటన అని ఎంతమందికి తెలుస్తుంది. పైగా ఫలానా సీన్‌ను మేం తీసి వేశామని, ఎందుకు తీసివేయాల్సి వచ్చిందో పుష్ప వివరణ ఇచ్చుకోలేని పరిస్థితి.