వరలక్ష్మి శరత్ కుమార్ కాబోయే భర్త ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

June 29, 2024

వరలక్ష్మి శరత్ కుమార్ కాబోయే భర్త ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రముఖ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరియర్ మొదట్లో హీరోయిన్ గా కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. అయితే ఈమె హీరోయిన్గా కంటే విలన్ పాత్రలలోనే ఎంతో అద్భుతమైన ఆదరణ పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

ముఖ్యంగా క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో ఎంతో ఒదిగిపోయిన వరలక్ష్మి ఈ సినిమా తర్వాత తనకు అన్నీ కూడా ఇలా విలన్ పాత్రలలోనే అవకాశాలు రావడం విశేషం. ప్రస్తుతం వరుస సినిమాలలో నెగిటివ్ పాత్రలలో నటించడమే కాకుండా లేడి ఓరియెంటెడ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈమె వ్యక్తిగత జీవితంలో కూడా ముందడుగులు వేస్తున్నారు.

మార్చి రెండవ తేదీ నిశ్చితార్థం జరుపుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ జులై నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈమె పెళ్లికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది. తన పెళ్లి కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో పాటు కోలీవుడ్ సినీ రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఇక ఈమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు నికోలై సచ్ దేవ్.

ఈయనకు ఇదివరకే పెళ్లి జరిగే ఒక కుమార్తె కూడా ఉంది కొన్ని కారణాల వల్ల తన మొదటి భార్యని వదిలిపెట్టారు. అయితే ఈయన వ్యక్తిత్వం ఈయన ఆలోచన ధోరణి నచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆయనతో ప్రేమలో పడ్డారు. ఇక త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు ఇలాంటి తరుణంలోనే నికోలై సచ్ దేవ్ ఆస్తులకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

నికోలై సచ్ దేవ్ కి తరతరాల ఆస్తి భారీ స్థాయిలో కలిసి వచ్చిందిట ఈయనకు వందల కోట్లలోనే ఆస్తిపాస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ వాటి పై పెద్దగా మోజు లేదని సొంత కష్టంతోనే జీవితంలో ఎదగాలని ఆలోచన ఉన్న వ్యక్తి. ప్రస్తుతం ఈయన ముంబైలో ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్న సంగతి తెలిసిందే .అంతే కాకుండా సెలబ్రిటీలకు ఫోటోగ్రాఫర్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా ఫోటోగ్రఫీ ద్వారానే ఈయన నెలకు లక్షల్లో కొన్నిసార్లు ఆ లక్షల కాస్త కోట్ల వరకు వెళ్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనా వరలక్ష్మి శరత్ కుమార్ తనకంటే గొప్ప ఆస్తిపరుడునే భర్తగా చేసుకుంటున్నారని తెలుస్తోంది.

Read Moreప్రభాస్ కల్కి చిత్రంపై ప్రశంసల కురిపించిన రాజమౌళి.. ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు